జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ

ప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పైన దాఖలైన రెండవ, మూడవ ఛార్జీ షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనపై పి.టి (ప్రిసనర్ ట్రాన్సఫర్) వారంట్ జారీ చేసి సోమవారం ఇతరులతో పాటు కోర్టుకి రప్పించుకుంది. మే 27 నుండి జగన్…

జైలుకు జగన్: ట్రయల్ ఖైదీ 6093

జగన్ బెయిల్ పిటిషన్ ను సి.బి.ఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎ.పుల్లయ్య తిరస్కరించాడు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించాడు. జగన్ అరెస్టు చట్ట విరుద్ధం అన్న జగన్ న్యాయవాదుల వాదనలను జడ్జి తిరస్కరించాడు. సాక్షులను భయపెట్టి, సాక్ష్యాలను తారుమారు చేయగల స్ధాయిలో జగన్ ఉన్నాడని భావిస్తూ ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండడమే సరైందని తీర్పు ప్రకటించాడు. జగన్ ను తమ కస్టడికీ ఇవ్వాలన్న సి.బి.ఐ కోరికను కూడా జడ్జి తిరస్కరించాడు. జూన్ 12 న ఉప…

జగన్ అరెస్ట్, సోమవారం బంద్

అక్రమాస్తుల కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సి.బి.ఐ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ అరెస్టు అయినట్లు 7:20 గంటలకు ఆయన పార్టీ నేతలు ప్రకటించారు. అరెస్టు కు ముందు పోలీసులు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ‘ది హిందూ తెలిపింది. అరెస్టయిన జగన్ ఈ రాత్రికి దిల్ కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంటాడని ఎన్.డి.టి.వి తెలిపింది. “సి.బి.ఐ జగన్ మోహన్ రెడ్డి ని 7:15 కి అరెస్టు చేసింది”…

‘గాలి’ కేసులో సి.బి.ఐ ముందు హాజరైన ‘జగన్’

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిపతి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సి.బి.ఐ కోర్టు ముందు హాజరయ్యాదు. హాద్రాబాద్ లో కోఠి సెంటర్ వద్ద ఉన్న సి.బి.ఐ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు హాజరయినట్లుగా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. గాలి జనార్ధనరెడ్డి పాల్పడిన అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించడం కోసం సి.బి.ఐ సమన్లు జారీ చేయడంతో జగన్ సి.బి.ఐ ముందు హాజరు కావలసి వచ్చింది. గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘ఓబులాపురం…