సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది. నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…

జగన్ కేసు: హోమ్ మంత్రి సబితను ఊరడించిన తోటి మంత్రులు!?

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం. మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి…

మంత్రి కన్నా గారూ! మంత్రి పదవులకి బోలెడుమంది రెడీ

“బిజినెస్ రూల్స్ ప్రకారమే జి.ఒ లు జారీ చేశాం. ఈ జి.ఒ లని తప్పు పడితే భవిష్యత్తులో ఎవరూ మంత్రి పదవి చేపట్టరు.” (టి.వి 5) ఈ మాటలన్నది రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ.  జగన్ అవినీతి కేసులో తమకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల వల్ల భవిష్యత్తులో మంత్రి పదవులు నిర్వహించడానికి ఎవరూ ముదుకు రారేమోనని మంత్రిగారికి అర్జెంటుగా భయం పట్టుకుంది. కోర్టులు ఇలాగే అవినీతి పేరుతో మంత్రులకి నోటీసులు ఇస్తూ భయపెడుతుంటే…

జగన్ చిరునవ్వు వెనక… -కార్టూన్

జగన్ జైలు వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. జగన్ అవినీతి అంతా ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వం ఫలితమే. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలోని ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన కీర్తిని ఆ పార్టీయే ఆయనకి ఆపాదించింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తేవడమే కాక కేంద్ర పార్టీకి 33 మంది ఎం.పిలను సరఫరా చేసిన కీర్తి కూడా వై.ఎస్.ఆర్ ఖాతాలోనే ఉంది. రాజశేఖర రెడ్డితో…

జైలుకు జగన్: ట్రయల్ ఖైదీ 6093

జగన్ బెయిల్ పిటిషన్ ను సి.బి.ఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎ.పుల్లయ్య తిరస్కరించాడు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించాడు. జగన్ అరెస్టు చట్ట విరుద్ధం అన్న జగన్ న్యాయవాదుల వాదనలను జడ్జి తిరస్కరించాడు. సాక్షులను భయపెట్టి, సాక్ష్యాలను తారుమారు చేయగల స్ధాయిలో జగన్ ఉన్నాడని భావిస్తూ ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండడమే సరైందని తీర్పు ప్రకటించాడు. జగన్ ను తమ కస్టడికీ ఇవ్వాలన్న సి.బి.ఐ కోరికను కూడా జడ్జి తిరస్కరించాడు. జూన్ 12 న ఉప…

‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్ధాపించిన దిన పత్రిక ‘సాక్షి’ కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వై.ఎస్.ఆర్ స్ధాపించిన ‘ఇందిర’ టి.వి కి కూడా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ‘అక్రమ ఆస్తుల’ కేసు విచారణకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు సంస్ధలకు చెందిన బ్యాంకు ఖాతాలను సి.బి.ఐ స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

గాలి కోసం జగన్ బూతులు బెదిరింపులు

అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజుల్ని గాలి కంపెనీకి అప్పజెప్పడంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సి.బి.ఐ జగన్ అరెస్టుకి ఎందుకు వెనకాడుతోంది? గాలి జనార్ధన రెడ్డి కంటే ముందే ఇనుప గనుల లీజుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన కంపెనీని కాదని గాలి కంపెనీకి గనులు లీజు ఇచ్చారనీ, ఈ విషయంపై కోర్టుకి వెళ్లడంతో జగన్ తనను బెంగుళూరుకి మూడుసార్లు పిలిపించి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిట్టి బెదిరించాడనీ, అందువల్లనే తాను కేసుతో పాటు లీజు…

జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం…

జగన్ అవినీతికి మద్దతుగా రాజీనామాలు

దేశమంతా అన్నా హజారే అందిస్తున్న స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అవినీతికి మద్దతుగా 29 మంది ఎం.ఎల్.ఎ లు ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ జగన్ కి చెందిన అనేక స్ధావరాలపై గత రెండు రోజులుగా దాడులు చేస్తుండడంతో, జగన్ వేసిన ఎత్తుగడ ఇది. రాజీనామాల ఎత్తుగడతో జగన సాధించేదీ ఏమిటో అర్ధం కావడం లేదు. బహుశా ఉప…

జగన్ అరెస్టు కావొచ్చు, ఆస్తులూ పోవచ్చు -న్యాయ నిపుణులు

దేవుడి పాలనలో ఒక వెలుగు వెలిగిన దైవ కుమారుడికి కష్టాలు వచ్చిపడ్డాయి. న్యాయ వ్యవస్ధ క్రియాశీలంగా మారడం వల్లనో లేదా అది తను నిజానికీ చేయవలసిన పని నిజాయితీగా చేస్తున్నందునో దొంగ దేవుళ్ళ పాపాల సామ్రాజ్యాలు కూలుతున్న  శబ్దాలు వినపడుతున్నాయి. అవి పాపాల రాయుళ్ళకు కర్ణ కఠోరంగా ఉంటే, ఆ పాపాలలో సమిధలయిన సామాన్య మానవునికి వీనులవిందుగా తోస్తోంది. న్యాయ నిపుణులు ‘ముందుంది మొసళ్ల పండగ’ అంటున్నారు. జగన్‌ పాల్పడ్డాడంటున్న నేరాలను బట్టి చూస్తే భవిష్యత్తులో జగన్…