ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ కూల్చిన సిరియా సైన్యం
సిరియాలో ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టుల తరపున ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తేటతెల్లం అయింది. ఇజ్రాయెల్-సిరియా సరిహద్దులో సిరియా బలగాలపై ఫైటర్ జెట్ విమానాలతో బాంబు దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా బలగాలు కూల్చివేశాయి. దానితో మధ్య ప్రాచ్యంలో టెర్రరిస్టు సంస్ధలు జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మద్దతు ఉన్నట్లు స్పష్టం అయింది. కూల్చివేతను ఇజ్రాయెల్ నిరాకరించింది. కానీ సిరియా బలగాలపై తమ యుద్ధ విమానాలు బాంబు దాడులు చేసిన సంగతిని మాత్రం ఆ…