నేరుగా ఆవు పొదుగు నుండే పాలు తాగుతున్న బాలుడు, అయినా క్షేమం
ఇది 18 నెలల కాంబోడియా పసి బాలుడి కధ. ఈ బాలుడు నెల రోజులకు పైగా నేరుగా ఆవు పొదుగుని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. అయినా బాలుడు క్షేమంగానే ఉన్నాడని బాలుడి తాత చెబుతున్నాడు. బాలుడి పేరు ధా సోఫత్. బాలుడు గత జులై నుండీ నేరుగా ఆవు పొదుగునుండి పాలు తాగుతున్నాడని వెల్లడించాక ఆ వార్త అంతర్జాతీయంగా పతాక శీర్షికలను ఆక్రమించింది. ఇటీవల సంభవించిన తుఫాను దెబ్బకి బాలుడి తల్లిదండ్రుల ఇల్లు పాడైపోయింది. జీవనానికి…