భవంతిగుండా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవే, జపాన్ అద్భుతం -ఫొటోలు
సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే. ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల…