గాజా విధ్వంసం ఖరీదు $8 బిలియన్లు

40 రోజుల గాజా విధ్వంసం ఖరీదు 8 బిలియన్ డాలర్లు. అనగా 48,000 కోట్ల రూపాయలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ ఆదాయంలో ఇది 2/3 వంతుతో సమానం. కానీ ఉమ్మడి ఏ.పి జనాభా 10 కోట్లు కాగా గాజా జనాభా కేవలం 18 లక్షలు మాత్రమే. “గాజా భూభాగం సర్వ నాశనం అయిపోయింది. అనేక సంస్ధలు ఉమ్మడిగా పూనుకుంటే తప్ప పునర్నిర్మాణం సాధ్యం కాదు” అని గాజా గృహ నిర్మాణం మరియు ప్రజా పనుల…