గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 1

– —–మహిళా పత్రిక ‘మాతృక’ అక్టోబర్ నెల సంచిక నుండి. (రచన: సుమన) ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న ఆ గంధకపు పేలుళ్ల పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల…

ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసిసి అరెస్ట్ వారంట్!

Yoav Gallant and Benjamin Netanyahu ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్…

బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి

రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి…