ఫ్లాష్! గల్ఫ్ లో రెండు వారాల కాల్పుల విరమణ!

ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటల లోగా (అమెరికా కాలమానం ప్రకారం) హోర్ముజ్ జలసంధి ని బేషరతుగా తెరవక పోయినట్లయితే ఇరాన్ నరకం చవి చూస్తుందని డొనాల్డ్ ట్రంప్ నిన్న హెచ్చరించాడు. ఇరాన్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పైన, మౌలిక నిర్మాణాలైన వంతెనలు, ప్రభుత్వ భవనాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు సమస్తం అమెరికా బాంబు దాడుల్లో సర్వ నాశనం అవుతాయని హుంకరించాడు. వేల సంవత్సరాల ఇరాన్ నాగరికత ఒక్క క్షణంలో ఆవిరి చేసేస్తా అన్నాడు. అలా…