‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారు -కార్టూన్
ఉత్తర కొరియా అధిపతి ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారని ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు. కిమ్ జోంగ్-ఇల్ బతికి ఉన్నంత కాలం అంతర్జాతీయ రాజకీయాలలో చురుకుదనం పుట్టించాడనీ, తద్వారా రాజకీయ కార్టూనిస్టులకు కావలసినంత మేత దొరికిందనీ ఈ కార్టూనిస్టు అభిప్రాయం. అమెరికా, యూరప్ ల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ లొంగి ఉంటే ప్రపంచంలో పట్టించుకునేవారెవరూ పెద్దగా ఉండరు. అమెరికా మాట తు.చ తప్పకుండా వినే దేశాల పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అదే అమెరికా పక్కలో…