ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!

ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…

నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్పుతా! -అమెరికాతో రష్యా రాయబారి

ఐసిస్ పురోగమనానికి వీలుగా సిరియా సైన్యంపై వైమానిక దాడులు నిర్వహించి 80 మంది వరకు ప్రభుత్వ సైనికులను బలిగొన్నందుకు అమెరికాపై సిరియా కాస్త ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన డెర్ ఎజ్-జోర్ లోనే ఆకాశంలో ఎగురుతున్న అమెరికన్ గూఢచార డ్రోన్ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేసింది.  అమెరికా-రష్యాల మధ్య కొద్దీ రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం టెర్రరిస్టు. సంస్ధల వల్ల ఉల్లంఘనకు గురవుతుందని అందరూ భావిస్తుండగా అమెరికాయే ఒప్పందాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ…