రక్తం ఓడుతున్న బహ్రెయిన్ -కార్టూన్

లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా…

తీహార్ జైలు కాదు, త్రీ స్టార్ జైలు -కార్టూన్

2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది. వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ…

పట్టేవాడుంటే యు.పి.ఎ అవినీతి పుట్టలో బోలెడు అవినీతి “నోట్”లు

మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది. ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి,…

దరిద్రులకోసం పైసల్లేని అమెరికా సర్కార్ -కార్టూన్

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాల కోసం ఏడు ట్రిలియన్ డాలర్లు, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన బడా బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్లు ఇవ్వడం కోసం 14 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిన అమెరికా ప్రభుత్వం, దరిద్రులకు విదిలించడానికి నాణేల కోసం వెతుక్కుంటోంది. – కార్టూన్: హెంగ్, సింగపూర్ —

పాలస్తీనా రాజ్య ప్రకటనకు ఇజ్రాయెల్ ఆటంకం -కార్టూన్

అరవై ఏళ్ళనుండి ఇజ్రాయెల్ రాజ్య జాత్యహంకార ప్రభుత్వం కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజలు విముక్తి పొందకుండా అమెరికా, యూరప్ లు కాపలా కాస్తూ వచ్చాయి. జాత్యహంకార పదఘట్టనల కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజల తరపున ఇజ్రాయెల్, అమెరికాలతో కుమ్మకయిన వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా దేశం ఏర్పాటును ఏక పక్షంగా సమితి సమావేశాల్లో ప్రకటిస్తానని కొన్ని నెలలుగా చెబుతూ వచ్చాడు. సేవకుడు ఎంత సేవ చేసినా యజమానులకు తృప్తి దొరకదు. అబ్బాస్ ఎన్నిమార్లు ఇజ్రాయెల్…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…

గ్రీసు రుణ సంక్షోభం -కార్టూన్

గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే  కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ —————                   —————–                          ————–                       —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…

ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క. కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా. —

అమెరికా ఆర్ధికవృద్ధి మందగమనం + బడా బ్యాంకులు = జీరో ఆర్ధిక వృద్ధి -కార్టూన్

న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” బడా బ్యాంకులే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గొప్ప మాంద్యం (ది గ్రేట్ రిసెషన్) లోకి జారడానికి దోహదపడ్డాయి. సబ్ ప్రైమరీ హౌసింగ్ రుణాలను అతిగా సెక్యూరిటైజేషన్ చేసి తాజా కేకులుగా ప్రపంచం అంతా అమ్మి ద్రవ్య సంక్షోభంలోకి ప్రపంచాన్ని తోశాయి. అందుకు వారికి శిక్షకు బదులు ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల రూపంలో నజరానాలు అందాయి. అవి అందుకున్న బెయిలౌట్లు, రెండు యుద్ధాలు కలిసిన అమెరికా అప్పు, హిమాలయాలతో…

ఎట్టకేలకు స్వాతంత్ర్యం పొందిన లిబియా? -కార్టూన్

ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాల నాయకత్వంలో నాటో వాయు సేనలు లిబియా గగన తలంపై వీరవిహారం చేస్తూ లిబియా పౌరులను బాంబింగ్‌తో రక్షిస్తూ ముందు నడవగా ఇన్నాళ్లూ అమెరికాలో శి(ర)క్షణ పొందిన లిబియా స్వతంత్ర పిపాసులు లిబియా ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం తమ జీవితాల్ని ధారపోసి గడ్డాఫీ ప్రభుత్వంపై తిరుగుబాటును పరిపూర్తి కావించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్ ఆయిల్ కంపెనీలు నూతనంగా సంపాదించిన స్వేచ్ఛతో నూనె పొలాల్లోకి దుమికి ఆయిలోత్సాహంతో ఆనంద నృత్యం చేస్తున్నాయి.…

పౌరుల శవాల సాక్షిగా లిబియాలో “నాటో తిరుగుబాటు” పరిపూర్తి -కార్టూన్

నాటో బలగాలు నాయకత్వం వహించిన “లిబియా తిరుగుబాటు” పూర్తయ్యిందని అమెరికా ప్రకటించింది. ఇన్నాళ్లూ లిబియా ఆయిల్ వనరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలిపోయినట్లుగా పత్రికలు ప్రకటించాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఇన్నాళ్ళూ నేరుగా కుట్రలకు పాల్పడి, ప్రభుత్వాధిపతుల ఇళ్లపై బాంబులు జారవిడిచి తమ అనుకూల ప్రభుత్వాలను నిలబెడుతూ వచ్చిన అమెరికా, యూరప్ దేశాలు లిబియాలో వినూత్న పద్ధతిని అవలంబించాయి. “తిరుగుబాటు” అని ప్రచారం చేసి అది…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు

జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది. “మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!“ ————————————————— కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం…