గడ్డాఫీ మరణం అనంతరం??? -కార్టూన్
– హుర్రే…, హుర్రే… …, హుర్రే… … …! గడ్డాఫీ చచ్చాడోచ్! అయితే, ఇప్పుడేం చేద్ధాం?!? “??? !!! ???” —
– హుర్రే…, హుర్రే… …, హుర్రే… … …! గడ్డాఫీ చచ్చాడోచ్! అయితే, ఇప్పుడేం చేద్ధాం?!? “??? !!! ???” —
స్టీవ్ జాబ్స్ అనగానే యాపిల్ కంపెనీ, ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా టచ్ స్క్రీన్ గుర్తొస్తుంది. వేళ్లతో తాకి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆదేశాలివ్వడం అన్న నూతర ఒరవడికి స్టీవ్ జాబ్స్ శ్రీకారం చుట్టాడు. ఆయన ఆత్మకధను తిరగేయడానికి కూడా టచ్ స్క్రీన్ కోసం చూడడంలో వింతేమీ లేదు కదా. – ఏమిటీ?! టచ్ స్క్రీన్ లేదా!!! —
— పెట్టుబడిదారుడు: అయితే, మీ నిరసనలు దేనికోయ్? నిరసనకారుడు 1: ఉద్యోగాలు, ఇళ్ళు, ఆరోగ్య సంరక్షణ, విద్య… నిరసనకారుడు 2: న్యాయం, నిజాయితీ, నమ్మకం, మార్పు, హేతుబద్ధత… నిరసనకారుడు 3: శాంతి, శుభ్రమైన గాలి, నీరు, భూమి, భవిష్యత్తు… నిరసనకారుడు 4: ?! పెట్టుబడిదారుడు: అంతేనా? —
మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…
సౌదీ అరేబియాకు చెందిన ‘ఫెరాస్ బగ్నా’ దేశ పౌరుడుగా ఓ చిన్న ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియో ద్వారా చూపించి తద్వారా ధనవంతులనుండి విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వాలనుకున్నాడు. అనుకన్నదే తడవుగా ఫెరాస్ సౌదీ రాజధాని రియాధ్ లో పేద ప్రాంతాలకు వెళ్ళి వారి ఇళ్ల లోపలి భాగం కూడా చూపించి, వారి ఆర్ధిక పరిస్ధితి గూర్చి వారి చేతనే చెప్పించి ఆ దృశ్యాలతో ఒక వీడియో రూపొందించాడు. తన వంతు బాధ్యతగా తాను…
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’…
– “అయితే, ఈ ఆందోళనకారులను సరిపోయినంతమందిని అరెస్టు చేస్తే ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతుంది. అంతేగా మన ప్లాన్!” — —
యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి…
– -ఫస్ట్ పోస్ట్ నుండి —
లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా…
అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…
ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని చేసే అవకాశం రష్యా రాజ్యాంగం ఇవ్వదు. అందువలన తన కీలు బొమ్మగా అధ్యక్ష స్ధానానికి తన అనుచరుడు మెడ్వెడెవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానిగా పుతిన్ పని చేశాడు. ఇప్పుడు మెడ్వెడెవ్ పదవీకాలం…
ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే అమెరికా దురాక్రమణ యుద్ధాలకు తెగబడిందో అదే ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పుడు కోల్పోతున్నది. సంక్షోభంలో బడా కంపెనీలకు ట్రిలియన్ల డాలర్ల బెయిలౌట్లు మంజూరు చేసి కొండంత అప్పును అమెరికా మూటగట్టుకుంది. ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు…
2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది. వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ…
ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాల కోసం ఏడు ట్రిలియన్ డాలర్లు, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన బడా బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్లు ఇవ్వడం కోసం 14 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిన అమెరికా ప్రభుత్వం, దరిద్రులకు విదిలించడానికి నాణేల కోసం వెతుక్కుంటోంది. – కార్టూన్: హెంగ్, సింగపూర్ —