మరణ శయ్యపై ఉన్నా, అమెరికా కోలుకుంటోంది -కార్టూన్

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ అది చక్కగా కోలుకుంటోందని అక్కడి పాలకులు చెబుతున్నారు. అలా అని నిరూపించడానికి అష్ట కష్టాలూ పడుతున్నారు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఖరీదైన విద్య, పరిశ్రమల మూసివేత, పడిపోతున్న కొనుగోలు శక్తి మొదలైన సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ పై పై మెరుగులు అద్ది అమెరికా కోలుకుంటోందని చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నారు. – –  

ఇరాక్ విధ్వంసంతో అమెరికా సంతృప్తి, అందుకే సైన్యం ఉపసంహరణ -కార్టూన్

దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా ఇరాక్ లో అమెరికా సైన్యం తిష్ట వేసింది. ఒక దేశాన్ని, ఒక ప్రజా సమూహాన్ని ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగానూ ఇరాక్ ను అది విధ్వంసం కావించింది. ప్రజల నిత్యజీవనానికి అవసరమైన మౌలిక నిర్మాణాలన్నింటినీ -రోడ్లు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సౌకర్యం, రైలు మార్గాలు, ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ సరఫరా మార్గాలు మొ॥వి౦- సర్వనాశనం చేసింది. తాను స్ధాపిస్తానన్న ప్రజాస్వామ్యం ఊసుని పూర్తిగా విస్మరించింది. ప్రశాంతంగా బతుకుతున్న ఇరాకీయుల మధ్య, జాతి,…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారు -కార్టూన్

ఉత్తర కొరియా అధిపతి ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారని ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు. కిమ్ జోంగ్-ఇల్ బతికి ఉన్నంత కాలం అంతర్జాతీయ రాజకీయాలలో చురుకుదనం పుట్టించాడనీ, తద్వారా రాజకీయ కార్టూనిస్టులకు కావలసినంత మేత దొరికిందనీ ఈ కార్టూనిస్టు అభిప్రాయం. అమెరికా, యూరప్ ల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ లొంగి ఉంటే ప్రపంచంలో పట్టించుకునేవారెవరూ పెద్దగా ఉండరు. అమెరికా మాట తు.చ తప్పకుండా వినే దేశాల పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అదే అమెరికా పక్కలో…

‘క్షిపణి’ లో(తో)నే ‘కిమ్ జోంగ్-ఇల్’ సమాధి!!! కార్టూన్

కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు…

‘యూరో’ ను నిలబెట్టడానికి జర్మనీ, ఫ్రాన్సుల విఫల యత్నం -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు…

యూరోప్ సంక్షోభ పరిష్కారం, ది మిషన్ ఇంపాజిబుల్ -కార్టూన్

– ఎలక్ట్రానిక్ గాడ్గెట్: యూరప్ నాయకులారా! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: మరో 11 గంటల 10 సెకన్లలో…..                        మీ యూరప్ ఖండం అంతర్గతంగా బద్దలు కానుంది.   ఎలక్ట్రానిక్ గాడ్గెట్: ఇక మీ కర్తవ్యం: ఐక్యంగా ప్రయత్నించి వినాశనాన్ని అడ్డుకోవడం                          కాని మీరు ఇప్పుడే కదలాలి! గుడ్ లక్!! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: వెల్! ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? కదలండి!? యూరప్ నాయకులు: మేము ఎప్పుడూ లెవెన్త్ అవర్ వరకూ ఎదురు చూస్తాం!!! —                          —                             …

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…

సిరియా పై అమెరికా ఆశ, అడ్డుపడుతున్న రష్యా -కార్టూన్

– లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.

ఈజిప్టు ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగాయట -కార్టూన్

ఈజిప్టు నియంత ముబారక్ గద్దె దిగి పది నెలల తర్వాత అక్కడి సైనిక ప్రభుత్వం ఈజిప్టు చట్ట సభలకు ఎన్నికలు ఈరోజు నిర్వహించింది. నిన్నటి వరకూ అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన ప్రజలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొన్ని వందలమందిని కాల్చి చంపింది. కొన్ని వేలమందిని అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. ఉన్న ప్రజాస్వామ్య హక్కులన్ని హరించివేసి ప్రశాంతంగా మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది. జనవరి ఉద్యమం డిమాండ్…

ఆకుపైడ్, అన్‌ ఆకుపైడ్, ప్రీ ఆకుపైడ్ -కార్టూన్

బహిరంగ స్ధలాలు: నిరుద్యోగ ఉద్యమకారులతో “ఆకుపైడ్” అప్పు గృహాలు: అప్పులు తీరక బ్యాంకుల స్వాధీనం. ఫలితంగా “అన్ ఆకుపైడ్” శ్వేత భవనం: బిలియనీర్ల ఆస్తులు పెంచే కుట్రలతో “ప్రీ ఆకుపైడ్” – –

భారత మీడియా కంటికి సి.ఆర్.పి.ఎఫ్ ఇలానే కనపడుతుంది -కార్టూన్

భారత ‘సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన బలగాలు అడుగు పెట్టని రాష్ట్రం భారత దేశంలో లేదేమో. భారత దేశం లోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చడంవలన పేద గొప్ప తారతమ్యాలు తీవ్రం అవుతున్నాయి. కోట్లమంది జనానికి బ్రతుకు తెరువు చూపించక పోగా ఈ ప్రభుత్వాలు తమ బ్రతుకు తాము బతుకుతున్న ప్రజల జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు కావచ్చు,…

ఐ-ఫోన్ పాపాయి -కార్టూన్

సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కుతోంది. బొమ్మ, పాట, మాట, కదిలే బొమ్మ అన్నీ జేబులో ఒదిగిపోతున్నాయి. ప్రభుత్వాల విధానాలతో సమాచార విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేనా, కంప్యూటర్ల దగ్గర్నుండి ఐ ఫోన్ల వరకూ అన్నీ చిన్న పిల్లలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి. – –

అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

మరో లిబియా కానున్న సిరియా, అమెరికాకు అరబ్ లీగ్ సహకారం -కార్టూన్

లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్,…