ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అంతర్మధనం -కార్టూన్
– -(ఫస్ట్ పోస్ట్ నుండి)- –
– -(ఫస్ట్ పోస్ట్ నుండి)- –
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి…
2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అమెరికా, యూరప్ లకు చెందిన బడా కార్పొరేట్ కంపెనీలు అక్కడి ప్రభుత్వాల ద్వారా ప్రజలపైన దారుణమైన పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల ఫలితంగా అనేక యూరప్ దేశాలు క్షత గాత్ర దేశాలుగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము అభివర్ణించుకునే ఈ దేశాల ప్రభుత్వాలు తాము వత్తాసు పలికే పెట్టుబడిదారీ కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు…
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే. ప్రజలపై వీరు రుద్దే క్రమ…
పదిహేడు యూరప్ దేశాక కూటమి యూరో జోన్ కి జర్మనీ, ఫ్రాన్సు లు నాయకులు. వీరికి తమ తమ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలకి యూరో ఉమ్మడి కరెన్సీ అవసరం. ‘ఉమ్మడి కరెన్సీ ని కాపాడుకోవాలా?’ తమ దేశాల కంపెనీలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకోవాలా? అన్నది వీరి మీమాంస. ఈ మీమాంస వీరిని చెరో పట్టాపై నిలిపింది. తమ తమ పట్టాలపై కొనసాగుతూ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఎన్ని సమావేశాలు జరిపినా ఏం ప్రయోజనం? – – జర్మనీ…
యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ జర్మనీ గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే…
రెండు యుద్ధాల మధ్య విరామమే ‘శాంతి’ అని కారల్ మార్క్స్ మహాశయుడు చెప్పాడు. ఆధునిక మానవ జాతి సాగించిన యుద్ధాల చరిత్ర దానిని నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. యుద్ధాలని నివారించడానికే డిప్లొమసీ అని చెప్పే పాఠాల సంగతి ఎలా ఉన్నా, ‘డిప్లొమసీ’ అనాదిగా నమ్ముకున్నది మాత్రం ‘ఆయుధాలనే’నని ఈ కార్టూనిస్టు చెబుతున్నారు. ఆయుధాలను నమ్ముకున్న ‘డిప్లొమసీ’ సృష్టించేది యుద్ధాలనే కదా! – –
– మెక్సికో: ఈ ఎన్నికల సంవత్సరాలంటే నాకు పరమ ద్వేషం. ఫ్రాన్సు: కొండల కొద్దీ బురద విసురుతున్నారు. అమెరికా: జిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టేస్తున్నారు. రష్యా: ఆ బ్యాలట్ బాక్సుల్లో కుక్కాలి. చైనా పౌరుడు: సర్లే. కనీసం ద్వేషించడానికి ఎన్నికల సంవత్సరం అని ఒకటుంది కదా. – –
యూరప్ ని ఈ కార్టూన్ ఉద్దేశిస్తున్నప్పటికీ, అమెరికా, ఆసియాలకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు అప్పులివ్వడానికి అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు, ప్రజల పైన మాత్రం ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ రుద్దుతున్నాయి. కంపెనీల కోసం తాము చేసిన అప్పుని జాతీయ సమస్యగా చేసి ప్రభుత్వాలు ప్రజలపైన రుద్దుతున్నాయి. కంపెనీల కోసం చేసే ఖర్చుని ప్రజల కోసం చేస్తున్న ఖర్చుగా చూపుతూ, నామ మాత్రంగా ప్రజలపై చేస్తున్న ఖర్చులో అవి కోత పెడుతున్నాయి. ఆ విధంగా, ఓ వైపు ప్రజల…
– నాకు ఉద్యోగం లేదు సార్! “అవునా, అభివృద్ధి విరోధీ! నీకు ఉద్యోగం చేసే హక్కు లేదని ఎవరన్నారోయ్? – –
2012లో యూరప్ ఎలా ఉండబోతోంది? గ్రీసు తో ప్రారంభమై బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీలను సైతం తాకుతుందేమో అని భయపడుతున్న ‘యూరప్ రుణ సంక్షొభం’ ఏయే దేశాలను బలి గోరుతున్నది? రుణ సంక్షోభం విస్తరణ వల్ల యూరప్ జిడిపి వృద్ధి రేటు ఇంకా పడిపోతే అక్కడికి ఎతుమతులు చేసే ఇండియా, చైనాల ఆర్ధిక వ్యవస్ధలు ఎలా ప్రభావితం కానున్నాయి? ఇప్పటికే జిడిపి వృద్ధి క్షీణించిపోయిన భారత ఆర్ధిక వ్యవస్ధపైన యూరప్ రుణ సంక్షోభం మరింత తీవ్రంగా ప్రభావితం చేయనున్నదా?…
ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఇరవై యేడేళ్ల కిమ్ జోంగ్-యూన్ ని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మిలట్రీ అత్యున్నత సంస్ధ ఛైర్మన్ గానూ, ప్రభుత్వాధిపతి గానూ ఆయన నియమితుడు కావడం లాంఛనమే నని కొన్ని పత్రికలు చెబుతున్నా, అది అంత త్వరగా జరగకపోవచ్చు. కొత్త నాయకుడు ఇంకా పిల్లవాడేననీ, ఉత్తర కొరియా నిర్మించుకున్న అణ్వాయుధాలు ఆయన చేతిలోనే ఉన్నాయనీ, ఆయన సరదాగా పిల్లచేష్టలతో అణ్వాయుధాల…
కొత్త సంవత్సరంలో, అమెరికా సైనికులపై మానవ హక్కుల ఫిర్యాదులను విచారిస్తానన్న ఇరాక్ ప్రభుత్వ హెచ్చరికతో, ఇప్పటికే 4,500 అమెరికన్ సైనికుల శవాలను ఇంటికి పంపిన తర్వాత, ఇరాక్ నుండి సైన్యాలను ఉపసంహరించడానికి అమెరికా నిర్ణయించుకుంది. – –