ప్రశ్నించే నోరు మనదే ఐతే… -కార్టూన్
‘వడ్డించే వాడు మనోడే అయితే’ బంతిలో ఎక్కడ కూచున్నా అన్నీ అందుతాయన్నది సామెత. ‘ప్రశ్నించే నోరు మనదే అయితే, నచ్చిన సమాధానం చెప్పుకోవచ్చు’ అన్నది ఇప్పటి సామెత గా చేర్చుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన తామే నిరసన ప్రదర్శనలు చెయ్యడం ఎమిటి? బందులు హర్తాళ్ లు చేస్తూ ఆవేశకావేశాలు వెళ్లగక్కడం ఏమిటి? ఇక జనానికి సమాధానం చెప్పేదెవ్వరు? యు.పి.ఎ ప్రభుత్వం ఒకేసారి లీటర్ పెట్రో ధర రు. 7.54…














