రాహుల్ రేటింగ్ AAA, మన్మోహన్ రేటింగ్ AA+ -కార్టూన్

అట్లాంటిక్ సముద్రానికి అవతల ఒడ్డున అమెరికా రేటింగ్‌ని, స్టాండర్డ్ & పూర్ సంస్ధ AAA నుండి AA+ కి తగ్గించింది. హిందూ మహా సముద్రానికి ఇవతలి ఒడ్డున భారత ప్రజలు ప్రధాని మన్మోహన్ రేటింగ్‌ని AAA నుండి AA+ కి తగ్గించేశారు. అదే చేత్తో ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ రేటింగ్ లు ఏమీ లేని రాహుల్ గాంధీకి అమాంతం AAA రేటింగ్ ఇచ్చేశారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ మరియు సి.ఎన్.బి.సి-టి.వి18 సంస్ధల  ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్’ ను,…

తగలబడుతున్న కాగితం డబ్బు, రెక్కలిప్పిన బంగారం ధర -కార్టూన్

అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా రుణ సంక్షోభం…

యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్

అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…

కరప్షన్ వెల్త్ గేమ్స్ – 2010 -కార్టూన్

కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కూడా ఆరోపణలు చేసింది. సరిగా దర్యాప్తు చేయడం లేదని ఢిల్లీ హై కోర్టు మరోవైపు ఢిల్లీ పోలీసులను చెండాడుతోంది. అసలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధిపతిగా సురేష్ కల్మాడిని నియమించింది ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ చల్లగా చెప్పడంతో బి.జె.పి పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అప్పటికే సురేష్ కల్మాడిపై అనేక ఫిర్యాదులు…

అమెరికా రుణ సంక్షోభానికి తాత్కాలిక మాట్లు -కార్టూన్

అమెరికా రుణ పరిమితిని $2.1 పెంచడానికీ, బడ్జెట్ లోటు $2.1 ట్రిలియన్ తగ్గించడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు కుదుర్చుకున్న ఒప్పందం సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు తాత్కాలికంగా మాట్లు వేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దానివలన రాదు. అమెరికా ప్రజల మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, బడా కంపెనీల దోపిడి, వేతనాల స్తంభన… మొదలైన సమస్యలను పరిష్కరించకుండా,ఆర్ధిక వ్యవస్ధలొని వివిధ ప్రధాన అంగాల్లో తాత్కాలికంగా మాట్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించడం అవివేకం. అది…

లిబియా తిరుగుబాటుదారుల్లో వెల్లివిరుస్తున్న ఐకమత్యం -కార్టూన్

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్‌ లో పాల్గొంటున్న కమేండర్‌ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని…

మీడియా రారాజు రూపర్డ్ మర్డోక్, మీడియాతోనే ఇబ్బందిపడుతున్న వేళ -కార్టూన్

స్టార్ ఛానెళ్ల అధినేత, “న్యూస్ ఆఫ్ ది వరల్డ్”, “ది సన్” లాంటి టాబ్లాయిడ్ పత్రికలతో బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ సాధించిన మీడీయా రారాజు రూపర్డ్ మర్డోక్ ఇప్పుడు ఆ మీడియాతోనే ఇబ్బందిపడిపోతున్నాడు. పత్రికకు అగ్ర స్ధానం సంపాదించడానికీ, ఆ తర్వాత అగ్ర స్ధానన్ని నిలబెట్టుకోడానికి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన రూపర్డ్ మర్డోక్ తాను కూడా అందుకు అతీతుడను కానని అర్ధమై, తన ముఖం ఎలాంటిదో అద్దంలో ప్రతిబింబుస్తుండడంతో అసహనానికి లోనవుతున్నాడు. హత్యకు గురైన బాలిక…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

కుట్రదారులు కావలెను -కార్టూన్

“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి…

రేటింగ్‌లతో ఆర్ధిక పతనాలకు కారణమవుతున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు -కార్టూన్

స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), ఫిఛ్, మూడీస్… ఈ మూడు సంస్ధలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ ఉన్న “రేటింగ్ ఏజన్సీలు.” ఇవి వివిధ దేశాల, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీని చేపట్టిని దేశాల సావరిన్ అప్పులకు రేటింగ్ ఇస్తాయి. సావరిన్ అప్పులనే ట్రెజరీ బాండ్స్ అంటారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మార్కెట్ నుండి, అంటే ప్రవేటు పెట్టుబడిదారులనుండి అప్పులు సేకరించడం కోసం ట్రెజరీ బాండ్లు జారీ చేస్తాయని తెలుసుకున్నాం. వివిధ దేశాల ట్రెజరీ బాండ్లలో తమ…

హ్యాకింగ్‌కి గురైన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ఫోన్ -కార్టూన్

“నా ఫోన్‌ని హ్యాక్ చేశారా?! అసలే దుఃఖంలో ఉన్న ఈ ముసలోడికి అలా చేయడానికి మనసెలా ఒప్పింది!”   హత్యకు గురైన బాలిక ఫోన్‌ని హ్యాక్ చేసీ, న్యూయార్క్ లోని జంట టవర్లపై జరిగిన టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన వారి ఫోన్లను హ్యాక్ చేసీ, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాల్లో మరణించిన ఇంగ్లండ్ సైనికుల ఫోన్ లను హ్యాక్ చేసి… ఆ సమాచారాన్నే పెట్టుబడిగా “న్యూస్ ఆఫ్ ది వరల్డ్” పత్రికకు పేరు తెచ్చుకున్న రూపర్ట్ మర్డోక్ ఫోన్‌ని…

అమెరికా అప్పు -కార్టూన్

అమెరికా 14.3 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ అప్పు చేయకూడదని పరిమితి ఉంది. మూడు దురాక్రమణ యుద్ధాల పుణ్యమాని అప్పు గరిష్ట పరిమితిని చేరుకుంది. అప్పులు చేసి ఆర్ధిక సంక్షోభంలో కుదేలైన బడా బడా వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం బెయిలౌట్లు ఇచ్చింది. యుద్ధాలు మానేస్తే ఈ పరిస్ధితి వచ్చి ఉండకపోను. ఇప్పుడు అమెరికా తెచ్చిన కొన్ని అప్పులపై వడ్డీల చెల్లింపులకు, మరి కొన్ని అప్పుల పూర్తి చెల్లింపులకు గడువు ఆగష్టు 2 తేదీ గడువు. ఆ…

‘సి’ ఫర్ ‘కేపిటలిజం’ -కార్టూన్

నూతన మిలీనియంలో భాషలో ఇప్పటికే ఉన్న పదాలకు కొత్త అర్ధాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ఉన్న అర్ధం నేడు ఉండకపోవచ్చు. ఈ రోజున్న అర్ధం రేపు పాతబడిపోవచ్చు.  పాత సీసాలోనే కొత్త సారా అన్నమాట! పైకి ఎప్పటిలాగే కనపడినా లోపల సారంలో మాత్రం  తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక దేశంపైకి దాడి చేయడానికి ఆ దేశంలో ప్రపంచాన్ని నాశనం చేయగల “సామూహిక విధ్వంసక ఆయుధాలు” ఉన్నాయని సాకు చూపడం నిన్నటి టెక్నిక్కు. ఆ దేశంలోని ప్రజల రక్షణకే…

స్పెయిన్‌లో ఉద్యొగాల పరిస్ధితి -కార్టూన్

యూరప్ అప్పు సంక్షోభం యూరప్ దేశాలకు శాపంగా మారింది. ఖచ్చితంగా చెప్పాలంటే యూరప్ అప్పు సంక్షోభం యూరప్ ప్రజలకు శాపంగా మారింది. అప్పు కొండలా పేరుకు పోయి మార్కెట్ నుండి ట్రెజరీ బాండుల ద్వారా తేలికగా అప్పు సేకరించలేని పరిస్ధితిని అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలు దీని బారిన పడి నిరుద్యోగం, ఉద్యోగాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు లాంటి అనేక సమస్యలతో అల్లాడుతున్నారు. స్పెయిన్ కార్టూనిస్టు…