కర్ణాటక వద్ద అరిగిపోయిన బి.జె.పి రికార్డు -కార్టూన్
బి.జె.పి కర్ణాటక ‘నాటకం’ ముగిసేటట్లు కనిపించడం లేదు. యెడ్యూరప్ప ఒత్తిడితో ముఖ్యమంత్రి పీఠం నుండి ‘సదానంద గౌడ’ ను తొలగించిన బి.జె.పి అధిష్టానం ఇప్పుడు సదానంద గౌడ నుండి తాజా డిమాండ్లు ఎదుర్కొంటోంది. శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన సదానంద ఆ పని వదిలేసి అధిష్టానం ముందు సొంత డిమాండ్లు ఉంచాడు. సదానందకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఆయన శిబిరంలోని ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకా మంత్రివర్గంలో సగం పదవులు కావాలని…

