కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.…