రూపాయి విలువ: కిం కర్తవ్యం? -కార్టూన్
గురువారం కొద్దిగా మెరుగుపడిన రూపాయి విలువ శుక్రవారం ఇంకొంత మెరుగుపడిందని మార్కెట్ వార్తలు సూచిస్తున్నాయి. అమెరికన్ రిజర్వ్ బ్యాంకు బెన్ బెర్నాంక్ ప్రకటనతో డాలర్ కొనుగోళ్ళు, రూపాయి అమ్మకాలు పెరగడం వలన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయిన రూపాయి శుక్రవారం మధ్యాహ్నానికి డాలర్ కు రు. 59.82 పై ల స్ధాయికి పెరిగిందని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు కూడా మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనే దోహదం చేయడం గమనార్హం. ఇండియా కరెంటు ఖాతా లోటు కాస్త…