అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…