ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…

పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి…