జైల్లో “గాలి”

‘గాలి’ గారిని జైల్లో బంధించడం సాధ్యమవుతుందని నెల రోజుల క్రితం వరకూ ఎవరూ భావించి ఉండరు. కాని దేశంలోని దర్యాప్తు సంస్ధలను వాటిమానాన వాటిని పనిచేయనిస్తే ఒక్క “గాలి” గారినేం ఖర్మ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న యువరాజు గార్లను కూడా బంధించ వచ్చు. ఆ సంగతినే సి.బి.ఐ రుజువు చేస్తోంది. ఈ క్రియాశీలత ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాని, ఒక్కప్పుడు ఊహించనలవి కాని దృశ్యాలను భారత ప్రజ ప్రత్యక్షంగా, టి.వి ఛానెళ్ళలో సంతృప్తిగా, సంతోషంగా, కసిగా, కావలసిందే అన్నట్లుగా…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…