వ్యభిచారం స్కాండల్ లో ఒబామా సెక్యూరిటీ సిబ్బంది

ఒబామా భద్రత కోసం విదేశాల్లో విధులు నిర్వహించడానికి పోయి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒబామా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహారం ఇది. శని, ఆదివారాల్లో కొలంబియాలోని కార్టాజినా నగరంలో అమెరికా రాజ్యాల సంస్ధ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్ -ఓ.ఏ.ఎస్) సమావేశాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన ముప్ఫైకి పైగా దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. వారిలో ఒబామా ఒకరు. ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది…