ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర
సౌదీ అరేబియా, కతార్, టర్కీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ద్వారా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు సిరియాలో రెచ్చగొట్టి కొనసాగిస్తున్న కిరాయి తిరుగుబాటులో ఐ.ఎస్.ఐ.ఎల్/ఐ.ఎస్.ఐ.ఎస్ పాత్ర రహస్యం ఏమీ కాదు. వారిని మోడరేట్ ఉగ్రవాదులుగా పేర్కొంటూ కొన్నిసార్లు బహిరంగంగానే ఆయుధ, ధన, గూఢచార సహాయం అందజేసింది అమెరికా. తాజాగా బహిరంగంగానే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని ఒబామా ప్రకటించాడు. టర్కీ, జోర్డాన్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సి.ఐ.ఏ సైనిక శిక్షణ…