ఐ.ఎం.ఎఫ్ పదవికోసం పశ్చిమ దేశాలు, బ్రిక్స్ దేశాలకు మధ్య పోటీ
ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా…