అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల…

ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…