గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?
గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు,…






