గులెన్ ని త్వరగా పంపండి! -అమెరికాతో టర్కీ
టర్కీలో సైనికుల తిరుగుబాటుకు కుట్ర చేసిన ఫెతుల్లా గులెన్ ను టర్కీకి ‘అప్పగించే’ పనిని త్వరితం చేయాలని టర్కీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికాలో శరణు పొందుతున్న గులెన్ అప్పగింతకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయాలని, టర్కీ-అమెరికాలు చేసుకున్న ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందాన్ని అమెరికా గౌరవించాలని టర్కీ ప్రధాని బినాలి యెల్దిరిమ్ ఈ రోజు (శనివారం, ఆగస్టు 20) డిమాండ్ చేశాడు. టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో విదేశీ మీడియా విలేఖరులతో మాట్లాడుతూ టర్కీ ప్రధాని…