దురన్ ఆదం: టర్కీలో వినూత్న నిరసన

టర్కీ ప్రధాని రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నియంతృత్వ విధానాలకు, ఆయన అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న టర్కీ ప్రజలు సోమవారం నుండి వినూత్న నిరసన చేపట్టారు. ప్రముఖ టర్కీ నాట్య కళాకారుడు ఎర్దెమ్ గుండుజ్ ప్రారంభించిన ఈ నిరసన రూపం కొద్ది గంటల్లోనే దేశ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందడమే కాక అనేకమంది ఆయనను అనుసరించడానికి దారి తీసింది. ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే శరవేగంగా ఆదరణ పొందిన ఈ నిరసన…