బి.జె.పి మేనిఫెస్టో: చెవిలో పూలు, తోకకు ముడులు -కార్టూన్
చివరి నిమిషంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బి.జె.పి ఏక కాలంలో వివిధ సర్కస్ ఫీట్లను ప్రజల ముందు ప్రదర్శించింది. హిందూత్వ కేడర్ ని సంతృప్తిపరచడానికి ఒకవైపు మతోన్మాద హామీలు గుప్పిస్తూ మరోవైపు హిందూత్వను ఆదరించని జనం కోసం అభివృద్ధి, ఉద్యోగాలు హామీలు ఇచ్చింది. హిందూత్వను వదులుకోలేని బలహీనత ఒకవైపు వెనక్కి లాగుతుండగా, బూటకపు అభివృద్ధి మంత్రంతో అయినా ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన ఆగత్యం ఆ పార్టీకి కలిగింది. విదేశీ ప్రచార కంపెనీల సారధ్యంలో జాతీయతా సెంటిమెంట్లు…




