అమెరికా లోనూ వినాశనానికి దగ్గరైన అణువిద్యుత్ కర్మాగారాలు

జపాన్లో మార్చి 11 తేదీన సంభవించిన అతి పెద్ద భూకంపం, అది సృష్టించిన సునామీల దెబ్బకు ఫుకుషిమాలో గల దైచి అణు విద్యుత్ ప్లాంటులో అణు రియాక్టర్లు పేలిపోవడంతో అక్కడ ప్రజలు, ప్రభుత్వం నరక యాతనలు పడటం చూస్తూనే ఉన్నాము. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత, ఆ స్ధాయిలో తలెత్తిన అణు ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక జపాన్ ప్రభుత్వం నిస్సహాయ స్ధితిలో పడిపోయింది. జపాన్ ప్రభుత్వం అణు ప్రమాదం వలన తలెత్తిన ప్రమాదకర పరిణామాలను అరికట్టడంలో…