ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ తొలగింపు, రాజకీయ విశ్లేషకులు అప్రమత్తం
ఉత్తర కొరియా నుండి ఊహించని వార్త వెలువడింది. మిలటరీ చీఫ్ ‘రి యాంగ్-హో’ ను అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండీ, ఇతర అన్ని అధికార పదవులనుండీ తొలగించినట్లు ప్రభుత్వ వార్తా సంస్ధ కె.సి.ఎన్.ఎ ప్రకటించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ కు వైస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న రీ, అధికార పార్టీ వర్కర్స్ పార్టీలోనూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు. రీ తొలగింపు ‘అసాధారణం’ గా దక్షిణ కొరియా కొరియాల ‘ఏకీకరణ మంత్రిత్వ శాఖ’…
