ఈ వరుస హత్యా ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?

గత కొద్ది నెలల కాలంలో వివిధ దేశాల పాలకులను హత్య చేసేందుకు వరుసగా ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడు అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తో సహా, రష్యా అధ్యక్షుడు పుటిన్, స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మదురో, హమాస్ పోలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హానియే, హిజ్బొల్లా కమాండర్ ఖలీల్ ఆల్-మగ్దా… ఇలా వరస బెట్టి హత్యా ప్రయత్నాలు జరిగాయి. వీళ్ళలో ట్రంప్ కొద్ది పాటి…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు!

అనుమానించినట్లే జరుగుతున్నది. ఇరాన్ గడ్డపై హమాస్ సంస్థ పోలిటికల్ లీడర్ ను హత్య చేయడం పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీ ఆదేశాలు ఇచ్చాడు. ఆలీ ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక జులై 31 తేదీన తెలియజేసింది. సుప్రీం నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) అత్యవసరంగా జరిపిన సమావేశంలో ఖమెనీ ఈ…