ఇరాన్ ఒప్పందాన్ని చెరపొద్దు, ఇజ్రాయెల్ తో బ్రిటన్

ఇరాన్ తో పశ్చిమ దేశాలు కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం ఇజ్రాయెల్ ను ఒంటరి చేస్తోంది. ‘చరిత్రాత్మక ఒప్పందం’ గా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పేర్కొన్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ‘చారిత్రక తప్పిదం’గా తిట్టిపోసాడు. “ఇరాన్ ఒప్పందాన్ని చెరపడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదు” అని ఇజ్రాయెల్ ప్రధానికి బదులిస్తూ బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. “ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎవరైనా సరే, ఇజ్రాయెల్ తో సహా, చర్యలు తీసుకోకుండా చూస్తాము.…