జైల్లో “గాలి”
‘గాలి’ గారిని జైల్లో బంధించడం సాధ్యమవుతుందని నెల రోజుల క్రితం వరకూ ఎవరూ భావించి ఉండరు. కాని దేశంలోని దర్యాప్తు సంస్ధలను వాటిమానాన వాటిని పనిచేయనిస్తే ఒక్క “గాలి” గారినేం ఖర్మ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న యువరాజు గార్లను కూడా బంధించ వచ్చు. ఆ సంగతినే సి.బి.ఐ రుజువు చేస్తోంది. ఈ క్రియాశీలత ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాని, ఒక్కప్పుడు ఊహించనలవి కాని దృశ్యాలను భారత ప్రజ ప్రత్యక్షంగా, టి.వి ఛానెళ్ళలో సంతృప్తిగా, సంతోషంగా, కసిగా, కావలసిందే అన్నట్లుగా…
మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఒక అనుమాన పిశాచి అనీ, డిక్టేటర్‌ను పోలి ఉండే అలవాట్లు గల వ్యక్తి అనీ అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్న సంగతి వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. “పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ” అన్న హెడ్డింగ్‌తో రాసిన ఈ కేబుల్‌లో మాయావతి దళిత కార్డుని ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్నదేమీ లేదనీ, అభివృద్ధికి సైతం చేస్తున్నదేమీ లేదని రాయబారి పేర్కొన్నాడు. 2007 నుండి 2009 వరకూ…
బాబా రాందేవ్ పై విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విభాగం బాబా రాందేవ్ పై గురువారం విదేశీ మారకద్రవ్య చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇ.డి అధికారులు గురువారం విలేఖరులకు సమాచారం అందించారు. బాబా రాందేవ్, ఆయాన్ ట్రస్టు అమెరికా, న్యూజీలాండ్, బ్రిటన్ ల నుండి అనధికారికంగా ఆర్ధిక సహాయం అందుకున్నాడని ఇ.డికి సాక్ష్యాలు దొరికాయని, దానితో కేసు నమోదు చేశామనీ అధికారులు చెబుతున్నారు. బాబా రాందేవ్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది వారాల క్రితం ఆమరణ నిరాహర…
పెను తుఫానునుండి కొద్దిలో తప్పించుకున్న న్యూయార్క్ నగరం -ఫోటోలు
పెను తుఫానుగా ప్రకటించిన ఐరీన్ న్యూయార్క్ ను తాకేసరికి తుపానుగా మారిపోవడంతో ‘పెను’ విధ్వంసం నుండి కొద్దిలో తప్పించుకుంది. అయినప్పటికీ మన హైద్రాబాద్ నగరం వర్షంలో తడిసినప్పటి దృశ్యాలు న్యూయార్క్ లో సైతం కనపడ్డాయి. “మెయిల్ ఆన్ లైన్” అందించిన ఈ ఫోటోలు:
దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం
వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించి దళితులకు పాలు అందకుండా చేశారు గ్రామ పెద్దలు. 64 సంవత్సరాల స్వాతంత్ర్య పాలన దళితులకు ఒరగబెట్టినదేమిటో, అగ్రవర్ణాలకు నేర్పిన సంస్కారం ఏమిటో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి…
అమెరికా తూర్పు తీరానికి పెనుతుఫాను (ఇరేనే) తాకిడి -నాసా ఫోటో
అమెరికా తూర్పు తీరాన్ని ‘ఇరెనె’ పెను తుఫాను వణికిస్తొంది. అమెరికా ప్రభుత్వం ఈ పెను తుఫాను తాకిడిని తట్టుకోవడానికి అసాధారణ ఏర్పాట్లు చేసింది. తూర్పు తీరాన ఉన్న న్యూయార్క్ నగరాన్ని కూడా ఇది తాకింది. ఇరెనె ను నాసా కేంద్రం తన ఉపగ్రహం నుండి తీసిన ఫోటో, పెను తుఫాను స్వరూపాన్ని తెలియజెపుతుంది. ఫొటోను బిబిసి ప్రచురించింది. పెద్ద బొమ్మ కోసం ఫొటోపై క్లిక్ చేయండి   —
జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం…
చైనా ఇంటర్నెట్ వినియోగదారులు 45.7 కోట్ల మంది
రెండు వారాల దీక్షకు ఒప్పందం, గడువు ముగిశాక సమీక్ష
జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు. అయితే రెండు వారాల…
తాలిబాన్ దాడికి అమెరికా షాక్‌కి గురైన వేళ…
ఎస్&పి ఆర్ధిక పరంగా అమెరికా రేటింగ్ ని తగ్గిస్తే, ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్, అమెరికాని మిలట్రీ పరంగా రేటింగ్ ని పడదోసిన పరిణామం ప్రపంచ దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. అమెరికాకి చెందిన శక్తివంతమైన ఛినూక్ హెలికాప్టర్ ను తాలిబాన్ కేవలం ఒక రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ తో కూల్చివేయడం ద్వారా అమెరికాని షాకి కి గురి చేసింది. దాడిలో 19 అమెరికా నేవీ సీల్ కమెండోలు, 7గురు ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులు చనిపోగా మరో 12 మంది…
అయ్యా అయోమయం జగన్నాధం గారూ! తమరి గొప్ప విమర్శలకి సమాధానం ఇదిగో!!
“రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు” అన్న టైటిల్ తో నేను రాసిన పోస్టు కింద “అయోమయం జగన్నాధం” గారు రాసిన విమర్శకి ఇది సమాధానం. ముందు మీరు విమర్శలుగా భావిస్తున్నవాటికి సమాధానం. మీకు తెలియని విషయాలని అంత కాన్ఫిడెంట్ గా ప్రస్తావించి తప్పులెన్నాలని ప్రయత్నిస్తున్నందుకు ఒకరకంగా తమర్ని అభినందించవలసిందే. ఒక్కోటీ ప్రస్తావిస్తూ సమాధానం ఇస్తాను. (1) “చివరిగా ‘ది గ్రేట్ రిసెషన్’ కాదు ‘ది గ్రేట్ డిప్రెషన్’ ఏమో” అమెరికాలో రిసెషన్…
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే భారత దేశానికి నష్టకరం -ప్రణాళికా సంఘం
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే దాని ప్రభావం ఇండియాపై తీవ్రంగానే ఉంటుందని భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఒక ఇంటర్వూలో తెలిపాడు. సి.ఎన్.బి.సి-టి.వి 18 ఛానెల్ వారు అహ్లూవాలియాతో ఇంటర్వ్యూ చేసినపుడు ఆయన అమెరికా క్రెడిట్ రేటింగ్ కోత గురించి తన అభిప్రాయాలు తెలిపాడు. ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం వలన పారిశ్రామిక దేశాల్లో ఉద్భవించే ఏకైన సానుకూల పరిణామం, కమోడిటీ (సరుకుల) ధరలపైన ఒత్తిడి పెరగడమేనని తెలిపాడు. కానీ ఇండియాకి వచ్చేసరికి,…
ప్రపంచంలో అతి పొడవైన పది వంతెనలు -ఫోటోలు
సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనిషి సుసాధ్యం చేసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మ పరికరాలనుండి అతి పెద్ద ఆకాశ హర్మ్యాల వరకూ మనిషి తన జీవన సౌకర్యాల కోసం అభివృద్ధి చేసుకున్నాడు. పెద్ద పెద్ద డ్యాం లు కట్టి నీటిని నియంత్రణలోకి తెచ్చుకున్న మనిషి తనకు అవసరమైన చోటికి నీటిని తీసుకెళ్ళగలగడం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తెచ్చి పెట్టింది. యేసు క్రీస్తు నీటి మీద నడవడం నిజమో…