పెద్ద దొంగను పట్టిస్తే జరిగేదేమిటి? -కార్టూన్

సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా…

అమెరికా వ్యాపార రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన చైనీయుడు

అమెరికాలో స్ధిర నివాసం ఏర్పరచుకున్న చైనా శాస్త్రవేత్త ఒకరు అమెరికా వ్యాపార రహస్యాలను చైనాకు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ‘డౌ ఆగ్రో సైన్సెస్’ కంపెనీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేస్తూ వ్యాపార రహస్యాలను అందజేసాననీ, కార్గిల్ కంపెనీలో పని చేస్తుండగా వ్యాపార రహస్యాలను దొంగిలించానని సదరు శాస్త్రవేత్త ‘కీక్సూ హువాంగ్’ అంగీకరించాడని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ (డి.ఒ.జె) డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. గత ఆగస్టులోనే ఇదే విధంగా ‘జున్ వాంగ్’ అనే చైనీయుడు అత్యున్నత సామర్ధ్యంగల న్యూక్లియర్…

చెప్పు విసిరింది కేజ్రీవాల్ పైన కాదు, వందిమాగధుల అత్యుత్సాహంపైనే

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్ల ఛాంబర్ లోకి జొరబడి ప్రఖ్యాత లాయర్ ‘ప్రశాంత్ భూషణ్’ పైన దాడి చేసి కొట్టిన కొద్ది రోజుల్లోనే మరో అన్నా టీం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా దాడి జరిగిందని పత్రికలు వార్తను ప్రచురించాయి. సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగి పోతున్నాయని అసహనం వ్యక్తం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక దుండగుడు చెప్పు విసిరాడనీ, అతనిని అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారులు అక్కడే పట్టుకుని చావబాదారనీ తెలిపాయి. అయితే,…

సామాజికంగా, జీవ శాస్త్ర పరంగా “జాతి” నిర్వచనం

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, పౌర హక్కుల కార్యకర్త, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పైన బుధవారం ఢిల్లీలో దాడి జరిగింది. శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన లకు చెందిన సభ్యులు ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని పత్రికలు నిర్ధారించాయి. ఒకరు దాడి జరిగినపుడే పట్టుబడగా, మిగిలిన ఇద్దరు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఎందుకు లొంగిపోతున్నారని విలేఖరులు ప్రశ్నిస్తే “మేము చట్టాన్ని ఉల్లంఘించాము. అది నేరం. కనుక లొంగిపోతున్నాం” అని చెప్పారు.…

యూరప్ సంక్షోభంలోనూ దండుకుంటున్న ధనికులు -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి…

మానవ లిబర్టీ విగ్రహం -1918 నాటి ఫొటో

18,000 మంది అమెరికా సైనికులు లిబర్టీ విగ్రహం ఆకారంలో నిలబడి ఉండగా తీసిన ఫోటో ఇది. 1918 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐవా నగరంలో ‘కేంప్ డాడ్జి’ వద్ద తీసిన ఫొటో ఇది. విగ్రహంలో వివిధ ఎఫెక్టులు రావడం కోసం కొంతమంది సైనికులు టోపిలు ధరిస్తే మరికొందరు టోపిలు లేకుండా నిలబడ్డారు. కొన్ని చోట్ల టోపి ధరించి తల వంచి నిలుచుంటే, మరికొన్ని చోట్ల టోపితో తల ఎత్తి నిలబడ్డారు. టోపి లేకుండా కూడా…

కరుణానిధి తండ్రి హృదయం

సోమవారం మారన్ సోదరుల ఇళ్ళపైన సి.బి.ఐ అధికారులు దాడి చేసి రోజంతా తనిఖీలు జరిపి కీలకమైన రికార్డులు పట్టుకెళ్ళారు. –వార్త కరుణా నిధి: నేను నా కూతురు కనిమొళినీ  మారన్ సోదరులనూ సమానంగా చూస్తాను. (అందుకే కనిమొళి ఉన్నచోటుకే మారన్ సోదరులను కూడా పంపించాలని చూస్తున్నారు) – — —

భవంతిగుండా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవే, జపాన్ అద్భుతం -ఫొటోలు

సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ  తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే. ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల…

‘యాపిల్’ సారధి ‘స్టీవ్ జాబ్స్’ అస్తమయం

యాపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించాడు. చాలా కాలంగా ‘పాంక్రియటిక్ కేన్సర్’ తో బాధపడుతున్న గత ఆగస్టు నెలలోనే యాపిల్ కంపెనీ సి.ఇ.ఓ పదవినుండి తప్పుకుని ఛైర్మన్ గా మిగిలాడు. యాపిల్ కంపెనీ ‘ఐ ఫోన్ 4ఎస్’ ని విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ చనిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలో ఆల్టో పట్టణంలో స్టీవ్ జాబ్స్ చనిపోయినపుడు…

ప్రపంచంలోనే చౌక ‘టాబ్లెట్’ విడుదల చేసిన ఇండియా

గత కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న ‘ఆకాశ్’ టాబ్లెట్ విడుదలయ్యింది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి కబిల్ సిబాల్ బుధవారం ‘ఆకాశ్’ ను విడుదల చేశాడు. విద్యార్ధులకు, పేదలకు సైతం కంప్యూటర్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆకాశ్’ టాబ్లెట్ మొదటి విడత లక్ష ఉత్పత్తులను విద్యార్ధులకు ఉచితంగా ఇస్తామని కపిల్ సిబాల్ ప్రకటించాడు. ‘డేటా విండ్’ అనే బ్రిటిష్ కంపెనీ ‘ఆకాష్’ ను తయారు చేస్తోంది. ఆ కంపెనీయే ‘ఆకాష్’ ను అభివృద్ధి చేసింది.…

అమెరికాలో “వాల్ స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం” ఉద్యమ హోరు

అమెరికాలో ఇప్పుడు “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమం హోరెత్తిస్తోంది. అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలని అణచివేయడానికీ అది వీలు కాకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికీ పావులు కదపడంలో బిజీగా ఉన్న అమెరికా తన ప్రజలు ఈజిప్టు ఉద్యమం తరహాలో చేస్తున్న ఉద్యమంతో కూడా సతమతమవుతోంది. అమెరికాలో నిరసనకారులు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమం చేయకపోవచ్చు గానీ అక్కడి ప్రజల్లో అమెరికా అవినీతి ప్రభుత్వంపైనా, విఫలమైన వ్యవస్ధపైన దాచిపెట్టుకున్న వ్యతిరేకత, ఎదుర్కొంటున్న నిరాశా నిస్పృహలు నిరసనల రూపంలో, “వాల్‌స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం”…

రెండు తలల పిల్లి -ఫొటోలు

ఆ మధ్య రెండు తలల పాము ఒకటి కనపడి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండు తలల పిల్లి వార్తలకెక్కి అబ్బుర పరుస్తోంది. ఈ ఫోటోలు సెప్టెంబరు 28 న తీసినవి. మసాఛుసెట్స్ లోని వార్సెస్టర్ లో నివసిస్తున్న మార్టి అనే ఆవిడ తన పిల్లిని ఫొటో లు తీయడానికి అనుమతించింది. తన రెండు తలల పిల్లికి ఆమే ఫ్రాంక్, లూయి అని పేర్లు పెట్టిందట. ఈ తరహా పిల్లులని జానుస్ కేట్ అంటారట. రోమన్ మైధాలజీలో ఒకే తలలో…

బూటకంగా తేలిపోయిన నరేంద్రమోడి “సద్భావన”

“శాకాహారం మాత్రమే భోంచేస్తానని” మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ నిర్వహించిన పులి గారు తన దీక్ష విరమించి నెలరోజులు కూడా కాక మునుపే తన “మాంసాహార” లక్షణాలను దాచి ఉంచుకోలేకపోయింది. తనకు తెలిసిన నిజాన్ని వెల్లడి చేసిన పొలీసు అధికారి సంజీవ్ భట్ పై కానిస్టేబుల్ చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరెస్టు చేసింది. కనీసం ఆయన భార్యను గానీ, లాయర్ ను గానీ కలవనీయకుండా నిర్భంధించింది. “నిన్నటి నుండీ సంజీవ్ ను కలవడానికి నన్ను…