ఐ-ఫోన్ పాపాయి -కార్టూన్

సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కుతోంది. బొమ్మ, పాట, మాట, కదిలే బొమ్మ అన్నీ జేబులో ఒదిగిపోతున్నాయి. ప్రభుత్వాల విధానాలతో సమాచార విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేనా, కంప్యూటర్ల దగ్గర్నుండి ఐ ఫోన్ల వరకూ అన్నీ చిన్న పిల్లలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి. – –

శరద్ పవార్ కి ఏకంగా చెంప దెబ్బే

జార్జి బుష్ పైన ఓ ఇరాక్ విలేఖరి చెప్పి విసిరిన నాటినుండి “చెప్పు విసరడం” అన్నది ఒక పెద్ద నిరసన కార్యక్రమంగా ముందుకొచ్చింది. ఈ నిరసన రూపం ప్రపంచం అంతా శరవేగంగా వ్యాపించిందంటే అతిశయోక్తి కాదు. ‘ఆ బూటు సైజు ఫలనా’ అని వ్యాఖ్యానించి అదేమంత పెద్ద విషయం కాదంటూనే జార్జి బుష్షు సదరు విలేఖరిని జైలుకి పంపి కసి తీర్చుకున్నాడు. తాజాగా భారత వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏకంగా చెంప దెబ్బే తిని…

కెమెరా కంటికి చిక్కిన హెలికాప్టర్ క్రాష్ -ఫొటోలు

న్యూజిలాండ్ లో ఆక్లాండ్ నగరంలో బుధవారం జరిగిందీ ఘటన. వైడక్ట్ హార్బర్ వద్ద క్రిస్టమస్ ట్రీని నిలపడానికి హెలికాప్టర్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అది కూలిపోయింది. చుట్టూ జన సమ్మర్ధం ఉన్నప్పటికీ ఎవరికీ తీవ్ర గాయాలేవీ తగల్లేదని రాయిటర్స్ తెలిపింది. పైలట్ కూడా పెద్ద గాయాలు తగలకుండా బైటపడ్డాడట. ప్రవేటు వ్యక్తి కెమెరాలో బంధించగా అతని నుండి రాయిటర్స్ ఈ వీడియో సంపాదించింది.

ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్

అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని…

పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అమెరికా సాయం కోరిన అధ్యక్షుడు జర్దారీ

పాకిస్ధాన్ దివంగత మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ చుట్టూ ‘మెమో గేట్’ కుంభకోణం ముసురుకుంటోంది. అమెరికా ప్రత్యేక బలగాలు పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేసిన అనంతరం పాకిస్ధాన్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి మిలట్రీ ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుతుందన్న భయంతొ అది జరగకుండా ఉండడానికి పాక్ అధ్యక్షుడు అమెరికా సహాయం కోరినట్లుగా ఒక మెమో వెల్లడి కావడంతో ‘మెమో గేట్’ కు…

మాజీ రాష్ట్రపతి ‘కలాం’ వళ్ళంతా వెతికిన తెల్లతోలు దురహంకారులు

అమెరికా దురహంకారం మరో రెండు సార్లు భారతీయ గౌరవాన్ని తిరస్కరించింది. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా తన దురహంకారం తగ్గించుకునేదే లేదో పొమ్మంది. అంతర్జాతీయ ప్రొటోకాల్ తన ముందు దిగదుడుపేనని చాటి చెప్పింది. భారత నాయకులు, ప్రభుత్వాధికారుల దేశాభిమానానికి మరోసారి ‘నిరూపించుకొమ్మని’ సవాలు విసిరింది. సెప్టెబరు నెలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికా వెళ్ళిన సందర్భంగా న్యూయార్క్ నగరంలోని ‘జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం’ లో రెండుసార్లు ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తూ ఆయనను ఒళ్ళంతా తడిమి…

‘హరిద్వార్’ పుణ్యక్షేత్రం వద్ద తొక్కిసలాట, 16 మంది భక్తుల దుర్మరణం

హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు. కొన్ని పదుల వేలమంది హాజరైన…

‘గాలి’ కేసులో సి.బి.ఐ ముందు హాజరైన ‘జగన్’

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిపతి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సి.బి.ఐ కోర్టు ముందు హాజరయ్యాదు. హాద్రాబాద్ లో కోఠి సెంటర్ వద్ద ఉన్న సి.బి.ఐ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు హాజరయినట్లుగా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. గాలి జనార్ధనరెడ్డి పాల్పడిన అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించడం కోసం సి.బి.ఐ సమన్లు జారీ చేయడంతో జగన్ సి.బి.ఐ ముందు హాజరు కావలసి వచ్చింది. గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘ఓబులాపురం…

‘టచ్ స్క్రీన్’ లేని స్టీవ్ జాబ్స్ ‘ఆటో బయోగ్రఫీ’ -కార్టూన్

స్టీవ్ జాబ్స్ అనగానే యాపిల్ కంపెనీ, ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా టచ్ స్క్రీన్ గుర్తొస్తుంది. వేళ్లతో తాకి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆదేశాలివ్వడం అన్న నూతర ఒరవడికి స్టీవ్ జాబ్స్ శ్రీకారం చుట్టాడు. ఆయన ఆత్మకధను తిరగేయడానికి కూడా టచ్ స్క్రీన్ కోసం చూడడంలో వింతేమీ లేదు కదా. – ఏమిటీ?! టచ్ స్క్రీన్ లేదా!!! —

ప్రేమ దక్కవలసిందెప్పుడు? దక్కుతున్నదెప్పుడు?

ఈ కవిత ఫేస్ బుక్ నుండి సంగ్రహించాను. రచయిత ఎవరో తెలియదు. చక్కగా రాశారు. అంకితా రెడ్డి అన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో దీనిని చూశాను. ఈ కవిత క్రెడిట్ అంతా ఆ అజ్ఞాత రచయిత/త్రి కే చెందుతుంది. – — —

231 మంది పార్లమెంటు సభ్యత్వం సస్పెండ్ చేసిన పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్

ఎన్నికల సంస్కరణల గురించి భారత దేశ నాయకులు ఇంకా మాట్లాడడం ప్రారంభమే కాలేదు. పాకిస్ధాన్ మాత్రం ఆ విషయంలో ఓ పెద్ద ముందడుగు వేసింది. తమ ఆస్తులను నిర్ణీత వ్యవధిలోగా ప్రకటించనందుకు గాను ఏకంగా 231 మంది చట్ట సభల సభ్యుల సభ్యత్వాన్ని పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల సంస్కరణలపై కూడా తాను పోరాడుతానని అన్నా హజారే గతంలో ప్రకటించాడు. ఆయన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రకటన చేసినందుకే రాజకీయ నాయకులు…