ఇరాక్ యుద్ధం ముగిసిందట! -ఫొటోలు

‘ఇరాక్ యుద్ధం’ ముగిసిందని డిసెంబరు 15 తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించాడు. ఇరాక్ లో తమ పని ముగిసిందనడానికి ప్రతీకగా అక్కడ అమెరికా పతాకాన్ని అవనతం చేశారు. రెండు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఎనిమిదేళ్ల పాటు ఎందుకు కొనసాగిందో అమెరికా నాయకులు ఇంతవరకూ వివరించలేదు. సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని తెలిసినా ఇరాక్ లో సైన్యాన్ని ఎందుకు కొనసాగించారో ఇంకా చెప్పలేదు. అమెరికా లెక్క ప్రకారమే లక్షమంది ఇరాక్ పౌరులను చంపిన అమెరికా నాయకులకు…

జపాన్ లో మరో అణు ప్రమాదం, రేడియేషన్ నీరు లీకేజి

జపాన్ లో మరో అణు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాయవ్య జపాన్ లో నెలకొల్పిన ఇక అణు విద్యుత్ కర్మాగారంలోపల రేడియెషన్ కలిసి ఉన్న నీరు లీక్ అవుతున్నట్లు కనుగొన్నారని తెలుస్తోంది. ఈ రేడియెషన్ లీకేజి అణు విద్యుత్ కర్మాగారం లోపలి వరకే పరిమితం అయిందనీ, ఇంకా వాతావరణంలోకి వెలువడలేదనీ తెలుస్తోంది. అయితే వాతావరణంలోకి రేడియేషన్ విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకున్నదీ లేనిదీ తెలియరాలేదు. వాయవ్య జపాన్ లో ఉన్న క్యుషు ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (కెప్కో)…

బేంక్సీ గీసిన మరికొన్ని వీధి చిత్రాలు -ఫొటోలు

‘బేంక్సీ ఇంగ్లండు లో ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. వయసు ముప్ఫై ఏడు. సినిమా డైరెక్టర్ కూడా. పెద్దగా కష్టపడకుండా ఆయన గీసే వీధి చిత్రాలు ఇంగ్లండ్ లో చాలా ప్రసిద్ధి పొందాయి. గోడలపైన సహజంగా ఏర్పడే ఆకారాలను తన చిత్రాలలో భాగంగా చెయ్యడంలో ఈయన దిట్ట. చూడండి మీకే తెలుస్తుంది. – –

జపాన్ పాలపొడి డబ్బాల్లో రేడియేషన్

జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున…

ఇంగ్లండ్ వీధి చిత్రకారుడి కళ -ఫొటోలు

BANKSY (బేంక్సి) ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. ఈయన సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. పెయింటర్ కూడా. ఇతని వీధి చిత్రాలు చాలా బాగుంటాయి. అందంగా, ఆలోచించేవిగా, వ్యంగ్యాత్మకంగా ఇలా చాలా రకాలుగా చిత్రాలు గీయగలడు. “షాప్ టిల్ యు డ్రాప్” అనే షాపు కోసం ఆయన ఆ షాపు గోడపైన గీసిన చిత్రం చూడండి. – –

సృజనాత్మక నిఘా -వీడియో

ఇది ప్రవేటు నిఘా కన్ను. జనాన్ని తన వద్దకు ఆకర్షించి మరీ నిఘా వేస్తుంది ఈ కన్ను. న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ లోని మిల్టన్ స్ట్రీట్ లో ఉన్న ఈ నిఘా కన్ను పదంతస్ధుల ఎత్తులో వాటర్ ట్యాంకు కింది భాగంలో ఏర్పాటు చేశారు. తన పరిధిలో తాను చూడగల ప్రాంతంలో ఎవరు వస్తున్నదీ, ఎవరు పోతున్నదీ అన్నింటినీ ఇది రికార్డు చేస్తుంది. ప్రవేటు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతంలో నిఘా పెడుతున్నందుకు ప్రభుత్వం అభ్యంతరం…

దిటవు గుండె గలవారే ఈ ఫొటోలను చూడాలి

మై గుడ్‌నెస్! ఈ బాంబు పెట్టినవారు ఈ ఫొటోలను చూసి జీవితంలో మళ్ళీ బాంబు పేలుళ్ళకు పాల్పడరని ఆశిద్దాం! ఇరవై రూపాయల బాడుగకు ఆశపడిన రిక్షా కార్మికుడికి ఎదురైన ఫలితం ఇది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో నవంబరు 30 న జరిగిన బాంబు పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం ఈ హృదయ విదారకమైన సన్నివేశం ఆవిష్కృతమయ్యింది. సాంగై ఫెస్టివల్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మన్మోహన్ డిసెంబరు 3 తేదీన ఇంఫాల్ సందర్శించనుండగా…

ఎంగిలాకులపై దొర్లే ‘మాదె స్నాన’ దళితులకే పరిమితమైన ఆచారం -ఫొటోలు

దక్షిణ కర్ణాటకలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఎంగిలాకులపై దొర్లే ఆచారంలో బ్రాహ్మణులు కూడా పాటిస్తారని ‘ది హిందూ’ పత్రిక రాసిన దానిలో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ఆచారం “మోలె కుడియా” అన్న గిరిజన తెగకు చెందినవారే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కుక్కె సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రభుత్వం అనుమతించింది. దీన్ని రద్దు చేయాలని కొన్ని సంవత్సరాలుగా దళిత, బి.సి సంఘాలు ఆందోళన…

అగ్రకుల పిల్లల పేరే పెట్టుకున్నాడని దళిత బాలుడిని చంపేశారు

భారత దేశంలో కుల దురహంకారం ఇంకా ఏ స్ధాయిలో కొనసాగుతున్నదో ఈ ఘటన పచ్చిగా చెబుతోంది. కుల పిచ్చికి ఉన్న రూపాలు ఇంకా పూర్తిగా ప్రచారం లోకి రాలేదేమోనని ఇటువంటి సంఘటనలు జరిగినపుడే తెలుస్తోంది. అగ్రకులస్ధుడికి ఉన్న ఇద్దరు పిల్లలకు ఏ పేర్లయితే ఉన్నాయో దళిత కులస్ధుడు కూడా పెట్టుకున్నాడు. పేర్లు మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా మార్చకపొవడంతో దళిత కులస్ధుడి పిల్లల్లో ఒకరిని చంపేశారు. (బి.బి.సి వార్త కోసం ఇక్కడ చూడండి). ఉత్తర ప్రదేశ్ లో ఈ…

హెచ్చరిక లేకుండా దాడి చేస్తే అనుమతి కోసం చూడకుండా బదులివ్వండి -పాక్ ఆర్మీ ఛీఫ్

హెచ్చరికలు లేకుండా పై దాడి జరిగితే పాకిస్ధాన్ సైనికులు తిరిగి దాడి చేయడానికి ఇక తమ పై అధికారుల అనుమతి తీసుకోనవసరం లేదని పాకిస్ధాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ కయానీ పాకిస్ధాన్ కమేండర్లకు చెప్పాడు. పాకిస్ధాన్ చెక్ పోస్టులపై దాడి చేసి అమెరికా కమెండోలు పాక్ సైనికులను చంపడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. “ఏ ఒక్క పాకిస్ధాన్ కమాండర్ మదిలో కూడా ఈ విషయంలో, ఏ స్ధాయిలోనైనా సరే, ఎటువంటి అనుమానం ఉంచుకోరాదు. తిరిగి…

ఆకుపైడ్, అన్‌ ఆకుపైడ్, ప్రీ ఆకుపైడ్ -కార్టూన్

బహిరంగ స్ధలాలు: నిరుద్యోగ ఉద్యమకారులతో “ఆకుపైడ్” అప్పు గృహాలు: అప్పులు తీరక బ్యాంకుల స్వాధీనం. ఫలితంగా “అన్ ఆకుపైడ్” శ్వేత భవనం: బిలియనీర్ల ఆస్తులు పెంచే కుట్రలతో “ప్రీ ఆకుపైడ్” – –

అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా

పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్…

‘వాల్ మార్ట్’ స్టోర్ ని తగలబెడతా -ఉమా భారతి

వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…