$15 బిలియన్ల వ్యాపార ఒప్పందాలకు చైనా, జర్మనీల అంగీకారం

యూరప్ పర్యటనలో ఉన్న చైనా ప్రధాని వెన్ జియాబావో, ఇంగ్లండులో మూడు రోజులు పర్యటించిన అనంతరం బుధవారం జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీ పర్యటనలో 15 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేసారని బిబిసి తెలిపింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని వెన్ లు వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక వ్యాపారం రానున్న 5 సంవత్సరాల్లో 200 బిలియన్ యూరోల (284 బిలియన్…

ఇద్దరు లెజెండ్ ఆటగాళ్ళు కలుసుకున్న వేళ -ఫోటోలు

సచిన్ టెండూల్కర్, రోజర్ ఫెదరర్, ఇద్దరూ వారి ఆటల్లో ఉన్నత స్ధానాలకు చేరుకున్నావారు. అయినా ఆటల దాహం తీరక ఇంకా ఇంకా సాధించాలని తపిస్తున్నవారు. తపించడమే కాక శ్రమిస్తున్నవారు. వీరిద్దరూ కలుసుకుంటే, ఆ క్షణాలు వారిద్దరికే కాదు వారిని ఆరాధించే అభిమానులకు కూడా కన్నుల పండుగే. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ కలుసుకున్న అపురూప క్షణాలివి.

పునరాగమనంలో ఎమోషనల్ ఐపోయిన టెన్నిస్ రాణి సెరెనా విలియమ్స్ -ఫోటోలు

పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉండే ఫ్రొఫెషనల్ లాన్ టెన్నిస్ రంగంలోకి సెరెనా, వీనస్ సోదరీమణుల రాక ఓ సంచలనం. గ్రౌండ్‌లో అడుగు పెట్టిన ప్రతిసారీ సింహనాదాలతో చెలరేగే చిన్న విలియమ్స్ సెరెనా, ఈ సారి మొదటి రౌండ్ గెలవడంతోటే ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యింది. 13 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను సొంతం చేసుకున్న 29 ఏళ్ళ సెరెనా, ఈ ఏడు వింబుల్డన్ టెన్నిస్ లోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగు పెట్టకముందు 49 వారాల పాటు టెన్నిస్‌కి దూరంగా…

దసరా బుల్లోడు “క్రిస్ గేల్” -ఫోటోలు

ఇండియా, వెస్ట్ ఇండీస్ దేశాల మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌కి కూడా స్టార్ బ్యాట్స్ మేన్ క్రిస్ గేల్ ను సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్లు ఇష్టపడలేదు. అయినప్పటికీ తన జట్టు సభ్యులను ప్రోత్సహించడానికి గ్యాలరీలో ప్రత్యక్షమయ్యాడు క్రిస్ గేల్. అది కూడా కలర్ ఫుల్ డ్రస్సులో దసరా బుల్లోడిలా…

ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…

ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…. ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా! దక్కినట్టే మరి, సిరి. [ఆలస్యమెందుకిక? పై లింక్‌ని క్లిక్ చేసి చూడడండి] – –

ఎం.పిలకు శుభవార్త: ఎం.పి లాడ్స్ నిధుల వినియోగంపై నిబంధనలు సడలించిన ప్రభుత్వం

భారత పార్లమెంటు సభ్యులకు ఓ శుభవార్త. తమ తమ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎం.పిలకు కేటాయించే నిధుల వినియోగంపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.పి. లాడ్స్ గా పిలిచే ఈ నిధులను ఖర్చు చేయడంలో ఇప్పటివరకు ఒకింత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. దానితో చాలా మంది ఎం.పిలు వారికి కేటాయించిన నిధులను ప్రజలకోసం ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ నిధులన్ని గణనీయ మొత్తంలొ…

ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఫిలిప్పైన్ దేశీయుడు -ఫొటోలు

శనివారం వరకు ప్రపంచంలో అత్యంత తక్కువ ఎత్తు గల వ్యక్తి నేపాల్ దేశీయుడైన ఖగేంద్ర ధాపర్ మగర్ (26.3 అంగుళాలు) భావిస్తూ వచ్చాం. తాజాగా ఫిలిప్పైన్ దేశీయుడైన “జున్రే బలావింగ్” అతని రికార్డును బద్దలు చేసి గిన్నిస్ బుక్‌లో స్ధానం సంపాదించాడు. గత ఆదివారంతో 18 సంవత్సరాలు నిండిన జున్రే ఎత్తు 59.93 సెంటీ మీటర్లు (23.36 అంగుళాలు) గా నమోదయ్యింది. జున్రే ఇప్పుడు బ్రతికి ఉన్నవారిలో మాత్రమే పొట్టివాడు. 1997లో చనిపోయిన భారతీయుడు గుల్ మహమ్మద్…

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికోసం ముగ్గురు మిగిలారు

రేప్ ప్రయత్నం నేరంపై స్ట్రాస్ కాన్ అరెస్టు ఐన తర్వాత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టరు పోస్టుకి పోటీ ఏర్పడింది. ఇప్పటివరకూ అమెరికా ప్రపంచ బ్యాంకు అధిపతిని నియమించుకుంటే, యూరప్ ఐ.ఎం.ఎఫ్ అధిపతిని నియమించుకునేవి. ఇప్పుడు ఎమర్జింగ్ దేశాలైన చైనా, ఇండియా, దక్షీణాఫ్రికాలు పోటీ పడుతున్నాయి. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే ఈ పదవికి ఎన్నిక కావచ్చని అంచనా వేస్తుండగా ఆమెకు పోటీ ఎదురవుతోంది. ఇండియా ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వలేదు. చైనా ఏమీ చెప్పడం లేదు.…

$2 బిలియన్లు నష్టమైనా ఎగుమతుదారులపై పన్నుల రద్దుకు నిర్ణయించిన ప్రభుత్వం

ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నప్పటికీ ఎగుమతిదారులకు ఇస్తున్న టాక్స్ బ్రేక్ కొనసాగించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నందున ఎగుమతిదారులపై విధించిన పన్ను రద్దు స్కీంను కొనగాగించకూడదని నిర్ణయించింది. ఐతే ఎగుమతిదారులైన భారత బిలియనీర్లు తీవ్రంగా అభ్యంతర పెట్టడంతో వారి ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తిరగదోడి ఎగుమతిదారులను సంతృప్తి పరిచింది. ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి “డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్ బుక్” (డి.ఇ.పి.బి)…

తగ్గిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్ధికవృద్ధి కూడా తగ్గే అవకాశం

ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి బాగా తగ్గిపోయింది. దానితో భారత దేశ ఆర్ధిక వృద్ధిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గక పోవడం, ద్రవ్యోల్బణం కట్టడికోసం బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు ఖరీదు పెరగడం వల్లనే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోయిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదలవలన రిజర్వు బ్యాంకు ఇక ముందు వడ్డీ రేట్లను పెంచడానికి అంతగా సుముఖంగా ఉండక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పారిశ్రామిక పారిశ్రామిక…

“సిరియా అణు కార్యక్రమం” అంశాన్ని భద్రతా సమితికి నివేదించిన ఐ.ఎ.ఇ.ఎ

అమెరికా, ఐరోపాల జేబు సంస్ధ అయిన “అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ” (ఐ.ఎ.ఇ.ఎ) సిరియా అణు విధానంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. భద్రతా సమితిలో వీటో అధికారం కలిగి ఉన్న చైనా, రష్యా లు సిరియా అంశాన్ని భద్రతా సమితికి నివేదించడానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాల ఐ.ఎ.ఇ.ఎ బోర్డు 17 – 6 ఓట్ల తేడాతో తీర్మానాన్ని ఆమోదించింది. 12 దేశాలు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇరాన్ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం భద్రతా…

విష వ్యర్ధాల డంపింగ్ ద్వారా 20 బిలియన్ యూరోలు సంపాదిస్తున్న ఇటలీ మాఫియా

డ్రగ్స్ రవాణా అమ్మకాలకీ, బలవంతపు వసూళ్ళకూ పేరుపొందిన ఇటలీ మాఫియా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే విష వ్యర్ధాలను డంపింగ్ చేయడంలో ఆ ఫ్యాక్టరీ యజమానులకు సాయపడ్డం ద్వారా సంవత్సరానికి 20 బిలియన్ యూరోలు (దాదాపు రు. 1,30,000 కోట్లకు సమానం) సంపాదిస్తోందని లండన్ నుండి వెలువడే ‘ది ఇండిపెండెంట్’ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇటలీ దక్షిణ ప్రాంతాన్ని విష వ్యర్ధాలు పారబోయడానికి డంపింగ్ యార్డుగా మాఫియా గ్రూపులు మార్చివేశాయని పర్యావరణ సంస్ధ నివేదికను ఉటంకిస్తూ ఆ పత్రిక…