పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం

పాలస్టీనియన్ హమాస్ రాకెట్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ నిరవధిక వాయుదాడులు ప్రారంభించిన దరిమిలా గాజాలో మృత్యువు మళ్ళీ విలయతాండవం చేస్తోంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (disproportionate) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది. హమాస్, 500 పైగా రాకెట్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ లో ఒక్క మరణమూ సంభవించలేదు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది (తాజా సంఖ్య 200 పైనే) పాలస్తీనీయులు ప్రాణాలు…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ హంతక దాడులు

ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు కూడా గాజా పై దాడి చేసి 7 గురు అమాయక పౌరులను బలి తీసుకుంది. శనివారం గాజాపై వైమానిక దాడులు జరిపి పది మందిని చంపిన ఇజ్రాయెల్, ఆదివారం మళ్ళీ అత్యాధునిక విమానాలతో జరిపిన బాంబు దాడుల్లో మరో 7 గురుని చంపేసింది. చనిపోయినవారిలో 12 యేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. గత కొద్ది నెలలుగా చెదురు ముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ముఖ్యమైన పాలస్తీనా నాయకుడిని ఇజ్రాయెల్…