పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం
ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…