జపాన్ డిఫెన్స్ పాలసీలో మార్పులు -2

ధాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం జపాన్ ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా మే 2 తేదీన ధాయిలాండ్ వెళ్ళాడు. రక్షణ పరికరాలు మరియు రక్షణ సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం మార్చుకునే సదుపాయాన్ని కల్పించుకునే లక్ష్యంతో ఆ దేశంతో కూడా రక్షణ ఒప్పందం చేసుకున్నాడు. “ద్వైపాక్షిక భద్రతా సహకారం” మరింత లోతుగా విస్తరించుకునేందుకు ఒప్పందంలో వీలు కల్పించారు. ఈ సందర్భంలో కూడా ఇరు దేశాలు “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాభవం పెరుగుతున్న నేపధ్యంలో” అని చెప్పుకోవడం మానలేదు. ఉక్రెయిన్…

అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు

ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం తరహాలో ఇండోనేషియా దేశస్ధులు బూడిద కాలం కూడా ఒకటుందని చదువుకోవాల్సిన రోజులు. అగ్ని పర్వతాలకు నిలయం అయిన ఇండోనేషియా ప్రజలకు అగ్ని కొండలు బద్దలు కావడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. సినబాంగ్ అగ్ని పర్వతం ఆరు నెలల కాలంలో మూడోసారి బద్దలై నిప్పులు చెరుగుతుండగా దానికి కెలుద్ అగ్ని పర్వతం కూడా జత కావడంతో అనేక మంది మరణించారు. ఫిబ్రవరి 14 తేదీన జావా ద్వీపంలోని…

కవోష్ణ జ్వాలల జిమ్ము సినబాంగ్ అగ్నికొండ -ఫోటోలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర రాష్ట్రంలోని సినబాంగ్ అగ్ని కొండ ఇంకా మండుతూనే ఉంది. తానే రగిలే వడగాలై అగ్ని కిలలు విరజిమ్ముతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి భారీ పరిణామాల్లో బూడిద, లావా, మంటలు ఆకాశంలోకి ఊస్తున్న సినబాంగ్ కొండ ధాటికి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలస పోవాల్సిన పరిస్ధితి. సినబాంగ్ కొండ చిమ్ముతున్న బూడిద పరిమాణాలను చూస్తే అక్కడేదో అణు బాంబు పేలినట్లే కనిపిస్తోంది. పైరో క్లాస్టిక్ వాయువు, బూడిద, మంటలు అని పిలుస్తున్న…

బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా

(బాలి సదస్సు గురించి రాసిన ఆర్టికల్ పై మరింత వివరించాలని ఉమేష్ పాటిల్ అనే పాఠకులు కోరారు. ఆ కోరికను కూడా ఈ ఆర్టికల్ నెరవేర్చగలదు. ) దోహా రౌండ్ చర్చలను పునఃప్రారంభించే రందిలో ఉన్న భారత ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా చెప్పుకుంటున్న ఆహార భద్రతా చట్టానికి తానే తూట్లు పొడిచేవైపుగా వ్యవహరించింది. ఇండోనేషియా నగరం బాలిలో ఈ నెలలో  ‘దోహా రౌండ్’ చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల భారీ వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలన్న డిమాండ్…

డబ్లూ.టి.ఓ రాతినేలపై ఇండియా నాగలి సాగు -కార్టూన్

ప్రపంచ వాణిజ్య సంస్ధ (World Trade Organization)! ప్రపంచ దేశాలను చుట్టుముట్టి మెడపై కత్తి పెట్టినట్లు ‘ఆమోదిస్తారా, చస్తారా’ అంటూ ఆమోదించబడిన తొంభైల నాటి డంకేల్ ముసాయిదా, గాట్ (General Agreement on Trade and Tariff) ఒప్పందంగానూ అనంతరం డబ్ల్యూ.టి.ఓ గానూ మన ముందు నిలిచింది. స్ధాపించింది మొదలు పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా సమస్త రంగాలను ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ అనే చురకత్తులకు బలి చేస్తున్న సంస్ధ డబ్ల్యూ.టి.ఓ. ఇప్పుడిది…

ఇదే.. ఇదే… రగులుతున్న అగ్ని పర్వతం!

‘రగులుతున్న అగ్ని పర్వతం’ అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణ నటించిన ‘అగ్ని పర్వతం’. కృష్ణ గారి నటన పుణ్యమాని బహుశా అనేకమంది అగ్ని పర్వతం రగులుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తిని కోల్పోయి ఉంటారు. మన సినిమా వాళ్ళు అగ్ని పర్వతం అనగానే నిప్పు కణికాలతో ఎర్రెర్రని మంటలు విరజిమ్మే దృశ్యాలనే మనకి అలవాటు చేశారు. కానీ అగ్ని పర్వతం బద్దలయినపుడు లావా విరజిమ్మడం అనేది ఒక భాగం మాత్రమే. లావాతో పాటు పెద్ద ఎత్తున బూడిద,…