భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు
గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…