ఇంటర్నెట్ గూఢచర్యం: నిజమే, అతిగా చేశాం -అమెరికా

అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ…

అమెరికా, నెంబర్ 1 ఇంటర్నెట్ స్వేచ్చా హంతకి

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో…

ఇంటర్నెట్‌ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్

తమది గొప్ప ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశాలే ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని కోరిన వాటిలో ముందుంటున్నాయి. గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం అమెరికా, బ్రెజిల్ ల తర్వాత ఎక్కువసార్లు వినియోగదారులపై నిఘా పెట్టమనిగానీ, వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వమని గానీ భారత ప్రభుత్వమే ఎక్కువ సార్లు కోరింది. గత సంవత్సరం (2010) జులై నుండి డిసెంబరు లోపు భారత ప్రబుత్వం 1699 సార్లు యూజర్ ఎకౌంట్ల సమాచారాన్ని కోరిందని గూగుల్ తెలిపింది. గూగుల్‌ని వినియోగదారుల సమాచారాన్ని…

ఇంటర్నెట్ స్వేఛ్చపై అమెరికాకు చైనా హెచ్చరిక

చైనా మరోసారి అమెరికాను హెచ్చరించింది. “ఇంటర్నెట్ స్వేఛ్చ పేరుతో తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేద”ని తీవ్రంగా హెచ్చరించింది. ఇంటర్నెట్ ఫ్రీడం కి సంబంధించి అమెరికాను చైనా హెచ్చరించడం ఇది రెండో సారి. తమ ఈ-మెయిల్ ఎకౌంట్లలోకి కొన్నింటిని చైనా హ్యాకర్లు జొరబడ్డారంటూ గూగుల్ 2010 సంవత్సరంలో చైనా ప్రభుత్వంతో తలపడినపుడు గూగుల్ కు మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. అమెరికా ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ హిల్లరీ క్లింటన్ గూగుల్ పై నిబంధనలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ…