టఫ్ గై: ఆడా మగా, ముసలి ముతక తేడాయే లేదు -ఫోటోలు

ఇంగ్లండ్ లోని పెర్టన్ లో జరిగే పోటీలివి. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పోటీ అని కూడా దీన్ని చెబుతారట. అత్యంత కఠినమైన పరీక్షల్ని పెట్టే ఈ పోటీ ప్రతి సంవత్సరం జరుపుతారని తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రతేడూ వేలాది మంది ఇందులో పాల్గొనడం. ఆడా, మగా; ముసలి, ముతకా అన్న తేడా లేకుండా ఈ పోటీల్లో పాల్గొనడం నిజంగా అబ్బురమే. అబ్బురం ఎందుకో ఈ ఫోటోల్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ పోటీల నుండి బైటపడ్డవారు ఖచ్చితంగా…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…