ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…

జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

రూపాయి పరిస్ధితి కడు దయనీయంగా మారింది. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా వినకుండా పాతాళంలోకి వడి వడిగా జారిపోతోంది. బుధవారం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజారి డాలర్ కి రు. 60.72 పైసల దగ్గర ఆగింది. సమీప భవిష్యత్తులో ఈ జారుడు ఆగే సూచనలు కనిపించడం లేదనీ మరింతగా రూపాయి విలువ పతనం కావచ్చని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి పతనానికి కారణం గత ఆర్టికల్ లో చర్చించినట్లు ఎఫ్.ఐ.ఐ (ఫారెన్…

ఏదైతే అదవుతుంది! -కార్టూన్

రూపాయి విలువ నూతన లోతులకు దిగజారుతున్నా, దుగుమతుల విలువ అమాంతం పెరిగిపోతున్నా మన పాలకులకు పెద్ద ఆందోళన లేదు. సరిగ్గా చెప్పాలంటే వారిపై వారికే నమ్మకం లేదు. జనం అయితే పోలీసుల్ని, సైన్యాన్నీ దించి అణచివేయొచ్చు గానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధిపతిని వీరేమి చేయగలరు? అందువల్ల ఆందోళన పడుతున్న భారత మదుపుదారులకు ‘మరేం ఫర్వాలేదు’ అని చెబుతూ తమకు తాము ‘చేసేదేముంది ఏదైతే అడవుతుంది’ అని చెప్పుకుని నిశ్చేష్టులై ఉండిపోయారు. సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) అనేది…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్

రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గింపు, గృహ ఆటో కార్పొరేట్ రుణాలు చౌక

భారత రిజర్వ్ బ్యాంకు తన స్వల్ప కాలిక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రధానంగా కార్పొరేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. నూతన పెట్టుబడుల కోసం, కంపెనీలు వ్యాపారాల విస్తరణ కోసం బ్యాంకులు మరిన్ని రుణాలను సమకూరుస్తాయి. తద్వారా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయాలన్నది ఆర్.బి.ఐ లక్ష్యం. గృహ రుణాలపై కూడా వడ్డీ…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…

తగ్గిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్ధికవృద్ధి కూడా తగ్గే అవకాశం

ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి బాగా తగ్గిపోయింది. దానితో భారత దేశ ఆర్ధిక వృద్ధిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గక పోవడం, ద్రవ్యోల్బణం కట్టడికోసం బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు ఖరీదు పెరగడం వల్లనే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోయిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదలవలన రిజర్వు బ్యాంకు ఇక ముందు వడ్డీ రేట్లను పెంచడానికి అంతగా సుముఖంగా ఉండక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పారిశ్రామిక పారిశ్రామిక…

భారత్ ను భయపెడుతున్న ఆహార, ఆయిల్ ద్రవ్యోల్బణాలు

భారత దేశానికి ద్రవ్యోల్బణం బెడద మరో సంవత్సరం తప్పేట్టు లేదు. జి.డి.పి వృద్ధి రేటులో చైనా తర్వాత అత్యధిక వేగవంతమైన పెరుగుదలను నమోదు చేస్తున్న ఇండియాకు ద్రవ్యోల్బణం గత ఒకటిన్నర సంవత్సరం నుండి వెంటాడుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఆయిల్ (ఇంధనం) ద్రవ్యోల్బణంలు ఏప్రిల్ 9 తేదితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పెరుగుదలను నమోదు చేసాయి. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఎనిమిది సార్లు బ్యాంకు రేట్లను పెంచింది. మార్చితో ముగిసే…