డాలరుతో 26 పైసలు పెరిగిన రూపాయి విలువ
స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా లాభాల బాట పట్టడంతో ఆ మేరకు రూపాయి విలువ కూడా కోలుకుంటోంది. శుక్రవారం రూపాయి విలువ డాలరు విలువతో పోలిస్తే 26 పైసలు పెరిగి రు.52.20/21 కు చేరుకుంది. ఇది గత రెండు వారాలలో అత్యధిక స్ధాయి కావడం గమనార్హం. ఎగుమతిదారులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు డాలర్ల అమ్మకం చేపట్టడంతో రూపాయి విలువ పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు లాభాలు సంపాదిస్తుండడం కూడా రూపాయి విలువ కోలుకోవడానికి దారి…