సిరియాపై ఆయుధ నిషేధం ఎత్తివేసిన ఐరోపా

తాను చెప్పిన నీతిని తానే అడ్డంగా ఉల్లంఘించింది యూరోపియన్ యూనియన్. రెండేళ్ల క్రితం సిరియాలో హింస చెలరేగినందున ఆయుధ సరఫరా మరింత హింసను ప్రేరేపిస్తుందన్న కారణం చెబుతూ సిరియాపై ఆయుధ నిషేధాన్ని (arms embargo) యూరోపియన్ యూనియన్ విధించుకుంది. ఇపుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎత్తివేతతో సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు యధేచ్ఛగా, బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేసుకునే అవకాశం ఐరోపా దేశాలకు వస్తుంది. ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు పెంచి, వెంటిలేషన్ పై ఉన్న…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసిన ఫ్రాన్సు, రష్యా నిరసన

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడిచినట్లుగా ఫ్రాన్సు సైన్యాధికారులు తెలిపారు. బెర్బెర్ తెగల ఫైటర్లకు లిబియా రాజధాని ట్రిపోలికి నైరుతి మూల ఉన్న కొండల్లో ఆయుధాలను జారవిడిచినట్లు ఫ్రాన్సు మిలట్రీ తెలిపింది. ఏప్రిల్ చివరినుండి జూన్ ప్రారంభంవరకూ తిరుగుబాటుదారులకు ఈ విధంగా ఆయుధాలను అందించామని వారు తెలిపారు. ఐతే ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం లిబియా యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకు ఆయుధాలు అందించడాన్ని నిషేధించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల అధికారులే స్వయంగా లిబియాలోని ఇరు…