పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా
ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…