అమెరికా విమాన దాడుల్లో 11 మంది ఆఫ్ఘన్ పిల్లల దుర్మరణం
అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి. అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని…













